US and Israel : ఖమేనీ చనిపోయినా తగ్గని ఇరాన్.. సీక్రెట్ ఇదే..

సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని చంపేస్తే వెంటనే యుద్ధం ఆగిపోతుందని అమెరికా, ఇజ్రాయెల్ భావించాయి. కానీ ఇరాన్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. సుప్రీం లీడర్ చనిపోయినా సరే మూడో వారంలోకి యుద్ధం ఎంట్రీ ఇచ్చింది అంటే దానికి కారణం ఇరాన్ వద్ద ఉన్న సీక్రెట్ అనే చెప్పాలి. తమను తాము కాపాడుకోవడానికి.. అమెరికా లాంటి దేశాలు దాడి చేస్తే ఆపకుండా యుద్ధం చేయడానికి ముందు నుంచి చేసుకున్న ప్లాన్ ప్రకారమే ఇప్పుడు యుద్ధం చేస్తోంది. 2003లో ఇరాక్ నేత సద్దాం హుస్సేన్ ను అమెరికా ఎలా చంపిందో ప్రపంచమంతా చూసింది. అగ్ర నేతను చంపేయడంతో ఇరాక్ సైన్యం మొత్తం లొంగిపోయింది. అమెరికా ప్రతి దేశం మీద ఇలాంటి ప్లాన్ ను అమలు చేస్తోంది. ఇది గమనించిన ఇరాన్.. ఎప్పటికైనా తమ మీద అమెరికా దాడి చేస్తే సైన్యం లోగిపోకుండా ఉండేందుకు ఒక ప్లాన్ వేసింది.
మొత్తం సైన్యాన్ని 31 ప్రావీన్సులుగా విభజించింది. ఒక్కో ప్రావిన్స్ కు ఒక అధినేతను నియమించింది. ఈ ప్రావీన్సులకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది. సొంతంగా ఆయుధ కర్మాగారాలను ఇవి కలిగి ఉంటాయి. సొంత ఆర్థిక వనరులు కూడా వీటి సొంతం. ఒకవేళ సుప్రీం లీడర్ గైడెన్స్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు.. ఇవి సొంతంగానే యుద్ధంలో పాల్గొంటాయి. సుప్రీం లీడర్ నుంచి ఆపమని ఆదేశాలు వచ్చేంతవరకు ఇవి యుద్ధంని కొనసాగిస్తూనే ఉంటాయి. అంటే ఒకవేళ సుప్రీం లీడర్ చనిపోయినా సరే.. ఇవి సొంతంగానే నిర్ణయాలు తీసేసుకుని యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇరాన్ సైన్యం చేస్తోంది కూడా అదే. అందుకే సుప్రీం లీడర్ చనిపోయినా సరే ఇరాన్ తగ్గేదేలే అన్నట్టు యుద్ధాన్ని కొనసాగిస్తుంది.
ఇదే ఇప్పుడు అమెరికాకు మింగుడు పడట్లేదు. ఇప్పటికే యుద్ధం కారణంగా అమెరికా లక్షల కోట్లు నష్టపోయింది. యుద్ధం ఇలాగే కొనసాగితే అమెరికాకు ఆర్థికపరంగా చాలా నష్టం తప్పదు. అందుకే ఇప్పుడు ట్రంప్ మిత్ర దేశాలు హర్మూజ్ జలసంధి వద్దకు యుద్ధనౌకలు పంపాలని కోరుతున్నారు. కానీ ఆయా దేశాలు మాత్రం తాము యుద్ధ నౌకలు పంపే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నాయి. ఇది ఒక రకంగా ట్రంప్ నకు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి. ఇప్పటివరకు ఏ దేశాలను అయినా అగ్ర నేతలను చంపేసి లొంగదీసుకున్న అమెరికాకు.. ఇరాన్ సైన్యం మాత్రం షాక్ ఇస్తోంది. యుద్ధం ఇలాగే కొనసాగితే అమెరికాతో పాటు ఇరాన్, ఇజ్రాయెల్, ప్రపంచ దేశాలకు తీవ్ర నష్టమే.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
