California : కార్చిచ్చులో లాస్ఏంజిల్స్!

అమెరికాలోని లాస్ ఏంజిల్స్ విలాసవంతమైన ఇండ్లును కార్చిచ్చు చుట్టుముట్టింది. వేలాది విల్లాలు విలాసవంతమైన ఇండ్లు అగ్నికి ఆహుతి అగ్నికి ఆహుతయ్యాయి. సంపన్న వర్గాలు అధికంగా ఉండే పాలిసాడ్స్ ప్రాంతంలో కార్చి చ్చు చెలరేగింది. దాదాపు మూడు వేల ఎకరాల కు పైగా దగ్ధమైంది. అగ్ని మాపక అధికారులు రెస్క్యూ చేసి 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాహనాలు దగ్ధమయ్యాయి. విలువైన వస్తువులు కాలిపోయాయి. వీధులను పొగమంచుకమ్మేసింది. ప్రజలు రోడ్లపైకి రావడంతో ట్రాపిక్ జామ్ ఏర్పడింది. రహదారులు ఇరుకుగా ఉండటంతో తప్పించుకునేందు కు పౌరులు నానా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు వంద మైళ్ల వేగంతో గాలులు వీస్తున్నాయని చెప్పారు. ఘటనపై కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ మాట్లాడుతూ.. చాలా నిర్మాణాలు కాలిపోయాయన్నారు. మరికొన్ని చోట్ల కూడా కార్చిచ్చు వ్యాపించే అవకాశం ఉందని తెలిపారు. మరో మొత్తం 13,000 నిర్మాణాల కు కార్చిచ్చు ముప్పున్నట్లు తెలుస్తోంది. బెవర్లీ హిల్స్, హాలీవుడ్ హిల్స్, మలిబు, శాన్ఫెర్నాండో
ప్రాంతాలకు కార్చిచ్చు వ్యాపించే ప్రమాదం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడి ఫైర్ అలర్ట్ లెవల్స్న పెంచారు. దాదాపు 62,000 మంది ప్రజలు కొన్ని గంటలుగా విద్యుత్తు లేక ఇబ్బందిపడుతున్నారు. ఇక్కడ మంటలను ఆర్ప డానికి విమానాలు, హెలికాప్టర్లు, బుల్డోజర్లను అధికారులు రప్పించారు.
ఇళ్లు కోల్పోయిన హాలీవుడ్ స్టార్స్
హాలీవుడ్ స్టార్లు టామ్ హాంక్స్, రీస్ విథర్స్పూన్, స్పెన్సర్ ప్రాట్, హెడీ మోంటాగ్ వంటి నటుల ఇళ్లు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. మరికొందరి ఇళ్లు కూడా అగ్నికీలలకు సమీపంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. స్థానిక అధికారుల సూచనలు పాటించాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com