Work from Home: వావ్.. వర్క్ ఫ్రమ్ హోం పర్మినెంట్‌గా..

Work from Home: వావ్.. వర్క్ ఫ్రమ్ హోం పర్మినెంట్‌గా..
Work from Home: కరోనా వచ్చి వర్క్ ఫ్రం హోం కల్చర్‌ని పెంచేసింది.. ఇంతకు ముందు సాప్ట్‌వేర్ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉండే ఈ కల్చర్ ఇప్పుడు దాదాపు అన్ని సంస్థలకు పాకింది..

Work from Home: కరోనా వచ్చి వర్క్ ఫ్రం హోం కల్చర్‌ని పెంచేసింది.. ఇంతకు ముందు సాప్ట్‌వేర్ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉండే ఈ కల్చర్ ఇప్పుడు దాదాపు అన్ని సంస్థలకు పాకింది.. ఇక ఇప్పుడు ఆఫీస్‌కు రండి ఇంటి దగ్గర ఉండి పని చేసింది చాల్లే అన్నా వినిపించుకోవట్లేదు.. ఆరు నూరైనా ఆఫీస్‌కు వచ్చేదేలే అంటున్నారు..

ఆఫీస్ అంటే పొద్దున్నే లేవాలి.. గబగబా రెడీ అవ్వాలి.. ట్రాఫిక్‌ని దాటుకుని ఆఫీస్‌కు చేరుకోవాలి.. అదంతా అవసరమా.. అయినా ఇంట్లో ఉండి కూడా చెప్పినపనంతా చేసేస్తున్నాం కదా అని అంటున్నారు ఒక దేశ వాసులో లేదా రాష్ట్ర వాసులో కాదు.. ప్రపంచం మొత్తం అదే పాట పాడుతోంది..

అందుకేనేమో నెదర్లాండ్ ప్రభుత్వం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం విషయంలో ప్రత్యేక హక్కును కల్పించింది. నచ్చితే ఆఫీసుకు రావచ్చు.. లేదంటే ఇంట్లోనే కూర్చుని హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. ఈ బిల్లుకు నెదర్లాండ్ పార్లమెంట్ దిగువ సభ మద్దతు పలికింది. సెనెట్ కూడా ఈ బిల్లుకు మద్దతు పలికితే దేశంలో వర్క్ ఫ్రం హోం చట్టం అమలు కానుంది.

ఈ సందర్భంగా నెదర్లాండ్ గ్రోన్‌లిక్స్ పార్టీకి చెందిన సెన్నా మాటౌగ్ మాట్లాడుతూ.. ఉద్యోగులు ఇంట్లో కుటుంబసభ్యులతో గడుపుతూనే ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు.. దీంతో సమయం కూడా ఆదా అవుతుంది. వర్క్ ఫ్రం హోంని చట్టబద్దమైన హక్కుగా మార్చేలా ఫ్లెక్సిబుల్ వర్కింగ్ యాక్ట్-2015ని సవరణ చేస్తామని అన్నారు. ఈ చట్టంతో ఉద్యోగులు తమ పని గంటలు పని ప్రదేశాన్ని మార్చుకునేందుకు వీలవుతుంది.

ఒక పక్క ఈ చట్టం అమలుకు చర్యలు తీసుకొంటుండగా మరోపక్క కరోనా తగ్గింది కదా ఆఫీసులకు రమ్మంటూ ఆయా సంస్థలు ఉద్యోగులకు ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి. కానీ ఉద్యోగులు అందుకు ససేమిరా అంటున్నారు.. చట్టం అమలులోకి వస్తే కనుక ఉద్యోగుల మాట సంస్థలు వినాల్సిందే. అయితే వర్క్ ఫ్రం హోం చేయడానికి గల కారణం బలమైనదిగా ఉండాలి. అంటే చాలా అవసరమైతే తప్ప వర్క్ ఫ్రం హోం ఇవ్వడానికి సంస్థలు ఒప్పుకోవు.

నెదర్లాండ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మరిన్ని దేశాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు మార్కెట్ నిపుణులు..

Tags

Read MoreRead Less
Next Story