World Population : ప్రపంచ జనాభా 8.09 బిలియన్లు

World Population : ప్రపంచ జనాభా 8.09 బిలియన్లు
X

అమెరికా సెన్సస్​ బ్యూరో అంచనాల ప్రకారం ప్రపంచ జనాభా ఈ ఏడాదిలో 7.1 కోట్లు పెరిగింది. కొత్త సంవత్సరం 1 జనవరి 2025 నాటికి వరల్డ్​ పాపులేషన్​ 8.09 బిలియన్లకు చేరుకోనుంది. 2023లో స్వల్ప మందగమనంతో సాగిన జనాభా పెరుగుదల 2024లో 0.9 శాతం పెరుగుదలతో 75 మిలియన్లు పెరిగింది. అమెరికా సెన్సస్ బ్యూరో ప్రకారం.. 2024లో యునైటెడ్ స్టేట్స్ 2.6 మిలియన్ల మంది పెరిగారు. కొత్త సంవత్సరం రోజు యూఎస్​ జనాభా 341 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఈ దేశంలో జనవరి 2025లో ప్రతి 9 సెకన్లకు ఒక జననం,ప్రతి 9.4 సెకన్లకు ఒక మరణం ఉంటుందని సెన్సస్​ బ్యూరో అంచనా వేసింది. అంతర్జాతీయ వలసలు ప్రతి 23.2 సెకన్లకు యూఎస్​ జనాభాకు ఒక వ్యక్తిని చేర్చగలవని, జననాలు, మరణాలు, నికర అంతర్జాతీయ వలసల వల్ల యూఎస్​ జనాభా ప్రతి 21.2 సెకన్లకు ఒక వ్యక్తి పెరుగుతుందని సెన్సస్ బ్యూరో తెలిపింది. ఇప్పటివరకు 2020లలో యూఎస్​ జనాభా దాదాపు 9.7 మిలియన్లు పెరిగింది. ఇది 2.9 శాతం వృద్ధి రేటు.

Tags

Next Story