Suryapet: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సూర్యాపేట యువకుడు మృతి..

X
Suryapet: సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ వ్యక్తి అమెరికాలో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. యూఎస్‌లోని ఒహయోస్టేట్‌లో ఉంటున్న చిరుసాయి.. ఉద్యోగం ముగించుకుని నివాసానికి కారులో వెళ్తుండగా వేగంగా వచ్చిన టిప్పర్ ఆయన ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది.
ప్రమాదంలో చిరుసాయి అక్కడిక్కడే మృతిచెందగా మరోకరు కోమాలోకి వెళ్లారు. చిరుసాయి మృతదేహాన్ని ఇండియాకు రప్పించేందుకు.. ప్రయత్నాలు చేస్తున్నారు. మృతుడి కుటుంబసభ్యులను బీజేపీ రాష్ట్రఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు పరామార్శించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో మాట్లాడి మృతదేహం స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
