Top

కొంతమంది ఉద్యోగులు చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్నా.. - జగన్

కొంతమంది ఉద్యోగులు చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్నా..  - జగన్
X

సచివాలయంలో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే ఉద్యోగులకు వరాలు ప్రకటించారు సీఎం జగన్. 27 శాతం ఐఆర్ ప్రకటించారు. ప్రజలు తనపై ఎంతో నమ్మకం ఉంచారని.. అవినీతిలేని పాలన అందించేందుకు ఉద్యోగులు సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. ఉదయం 8 గంటల 39 నిమిషాలకు సచివాలయం మొదటి బ్లాక్‌లోని తన చాంబర్‌లోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా తనకు ఘన స్వాగతం పలికిన ఉద్యోగులకు వరుస హామీలు ఇచ్చారు.

మేనిఫెస్టోలో ఉద్యోగస్తులకు చెప్పిన అన్ని అంశాలను పూర్తి చేస్తానని భరోసా కల్పించారు. సీపీఎస్‌ను కూడా రద్దు చేస్తామన్నారు. తొలి కేబినెట్‌లోనే వీటిపై చర్చించి ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై కమిటినీ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వంలో కాంట్రాక్టు పద్దతిలో పని చేస్తున్న వారికి సబంధించి వారి అర్హత, అనుభవం ఆధారంగా వీలైనంత ఎక్కువమంది ప్రభుత్వంలోకి తీసుకుంటామన్నారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు జీతాలు పెంచుతామన్నారు.

ఉద్యోగులంతా ఇళ్ల స్థలాల గురించి భయపడాల్సింది ఏమీ లేదన్నారు. ప్రతి విభాగంలో ప్రతి సెక్రటరీ, హెచ్‌వోడీ దగ్గర వైసీపీ మేనిఫెస్టో ఉండాలని అందరికీ చెప్పాను అన్నారు. గతంలో అప్పటి సీఎంగా చంద్రబాబుతో పని చేసి ఉండడంవల్ల కొంతమంది ఉద్యోగులు ఆయనతో సన్నిహితంగా ఉండొచ్చు... ఆ విషయాన్ని తాను తప్పుగా భావించనని.. అందరినీ సమానంగా చూస్తానని జగన్ హామీ ఇచ్చారు.

Next Story

RELATED STORIES