నంద్యాలలో విషాదం

X
TV5 Telugu9 Jun 2019 9:05 AM GMT
కర్నూలు జిల్లా నంద్యాలలో విషాదం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న వ్యక్తిపై క్రేన్ వెళ్లడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. బాచిపల్లె గ్రామానికి చెందిన సామెల్ గత 10 రోజుల క్రితం నేషనల్ హైవే క్యాంపర్ డ్రైవర్‌గా చేరాడు. రాత్రి ఆటోనగర్ వద్ద బ్రిడ్జి పనుల్లో పాల్గొన్న సామెల్..పక్కనే ఖాళీ ప్రదేశంలో నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలో వెనక నుంచి వచ్చిన క్రేన్ సామెల్ తలపై వెళ్లడంతో స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
Next Story