టీడీపీ, వైసీపీ పరస్పరం మాటల దాడి

X
TV5 Telugu23 Jan 2020 2:32 PM GMT
మండలిలో వైసీపీ మంత్రుల తీరును మాజీ మంత్రి యనమల తీవ్రంగా తప్పు పట్టారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ కార్యదర్శి లోకేష్‌లపై దాడి కూడా చేయడానికి సిద్ధమైపోయారని ఆరోపించారు. కొందరు మంత్రులు తాగి వచ్చినట్టు ప్రవర్తించారని యనమల విమర్శించారు.
యనమల వ్యాఖ్యలను మంత్రి బొత్స ఖండించారు. మంత్రులు తాగి వచ్చారనడం ధర్మంకాదన్నారు బొత్స. తాము చైర్మన్‌పై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదన్నారు. చట్టానికి లోబడి, రాజ్యాంగం ప్రకారమే వ్యవహరించామని వివరణ ఇచ్చారు. రాజధాని గ్రామాల రైతులతో ముందే తాము మాట్లాడి నిర్ణయం తీసుకున్నామన్నారు బొత్స.
Next Story