దేశంలో విస్తరిస్తున్న కరోనా.. జాతీయ విపత్తుగా ప్రకటించిన కేంద్రం

దేశంలో విస్తరిస్తున్న కరోనా.. జాతీయ విపత్తుగా ప్రకటించిన కేంద్రం

రోజు రోజుకు విస్తరిస్తూ ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ భారత్ లోను భయాందోళనకు గురిచేస్తోంది. వైరస్ కారణంగా ఇద్దరు మరణించడంతో కేంద్రప్రభుత్వం అలర్ట్ అయింది. మరోవైపు వైరస్ సోకిన వారి సంఖ్య 84 కు చేరింది. కేంద్రప్రభుత్వ ఆదేశాలతో అప్రమత్తమైన పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు విధించాయి. తెలంగాణతోపాటు మరో 9 రాష్ట్రాల్లో విద్యాలయాలు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. కర్ణాటకలో అన్నిరకాల సభలు, సమావేశాలు, వివాహాలు, ఎగ్జిబిషన్లు వారం పాటు నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసింది.

కరోనా వైరస్ దేశంలో రోజు రోజుకు విస్తరిస్తోంది. విదేశాల నుంచి వచ్చేవారిలో వైరస్ లక్షణాలు కనిపిస్తుండంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ప్రయాణీకులకు విమానాశ్రయాల్లోనే కరోనా వైరస్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 12లక్షల మంది ప్రయాణీకులకు స్క్రీనింగ్ నిర్వహించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రయాణీకులను వినాశ్రయంనుంచే నేరుగా ఆస్పత్రికి తరలించి పరిశీలిస్తున్నారు. కరోనా వైరస్ సోకి మరణించిన ఇద్దరికి కేంద్ర ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయలు ఎక్సిగ్రేషియా ప్రకటించింది. దేశంలో 13 రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.

కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హరియాణ, బీహార్, ఒరిశా, ఢిల్లీ, మహారాష్ట్ర, గోవా ప్రభుత్వాలు ముందుస్తు చర్యలు చేపట్టాయి. జన సమ్మర్ధ ప్రాంతాలైన స్కూళ్లు, కాలేజీలు, సినిమా ధియేటర్లను మూసివేశాయి. కరోనా వైరస్ తో దేశంలోనే మొదటిసారిగా ఒక వ్యక్తి మరణించడంతో కర్ణాటక సర్కారు హై అలర్ట్ ప్రకటించింది. ఐటి రాజధాని బెంగళూరుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా షాపింగ్ మాల్స్, సినిమా ధియేటర్లు, నైట్ క్లబ్ లు, సమ్మర్ క్యాంప్ లు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సదస్సులు, సమావేశాలు, వివాహాలను వారం రోజులపాటు నిలిపివేయాలని ముఖ్యమంత్రి యెడియూరప్ప ఆదేశాలు జారీచేశారు. యూనివర్సిటీలను సైతం మూసివేస్తున్నట్లు తెలిపారు. సాప్ట్ వేర్ ఉద్యోగులు ఇంటినుంచే పనిచేసేలా విధుల్లో మార్పులు చేయాలని సూచించారు. కల్బుర్గిలో కరోనా వైరస్ తో మరణించిన వ్యక్తికి సన్నిహితంగా ఉన్న 46మందిని గుర్తించి వారిని ప్రత్యేకంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.

కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఉత్తరప్రదేశ్ లో ఈనెల 22వరకు విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా ఢీల్లీలోను మార్చి 31 వరకు ధియేటర్లు, షాపింగ్ మాల్స్, అన్ని విద్యాసంస్థలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మహారాష్ట్రంలోని ప్రధాన నగరాల్లోను ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కరోనా కేసులు నమోదైన నగరాలైన ముంబై, పూణె,ధానె, నాగపూర్, నవీ ముంబై లలో మార్చి 30 వరకు మాల్స్, థియేటర్లు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్ మూసివేశారు. పంజాబ్ లో ను మార్చి 31 వరకు సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ లో ఈనెల 31 వరకు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ప్రకటించారు. అయితే పరీక్షలు మాత్రం యదావిధిగా జరుగుతాయని స్పష్టంచేశారు. అయితే హిమాచల్ ప్రదేశ్ లో ఒకకోవిడ్ కేసుకూడా నమోదు కాలేదు. ఇకకేరళలో కరోనా లక్షణాలతో ఉన్న అమెరికన్ ఆస్పత్రినుంచి బయటకు వెళ్లిపోవడంతో అతన్ని విమానాశ్రయంలో గుర్తించారు. ఇక ఇటలీలో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియాకు చెందిన విమానం మిలాన్ కు వెళ్లింది. ఇరాన్ నుంచి రెండో విడత 44 మంది యాత్రికులను స్వదేశానికి తీసుకొచ్చారు. ముంబై విమనాశ్రయంలో దిగిన వారిని వైద్యులపర్యవేక్షణలో ఉంచారు.

కొవిడ్ 19 వైరస్ దేశంలోని రోజు రోజుకు వ్యాప్తిస్తోంది. కేరళలో వైరస్ బారిన పడినవారి సంఖ్య 19కి చేరింది. మహారాష్ట్ర 15, హరియాణ 14, ఉత్తర్ ప్రదేశ్ 11, ఢిల్లీ 7, కర్ణాటక 6, రాజస్థాన్ 3, లడక్ 3, తెలంగాణ 2, ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, తమిళనాడు, పంజాబ్ లలో 1 కేసు చొప్పున నమోదయ్యాయి. హరియాణలో కరోనా పాజిటీవ్ వచ్చిన 14మంది విదేశీ యాత్రికులే. రాజస్థాన్ లో ఇద్దరు, ఉత్తర్ ప్రదేశ్ లో ఒకరు విదేశీయులే. కర్ణాటకలో కరోనాతో మొదటి మరణం సంభవించడంతో అక్కడి ప్రభుత్వం మరింత అలర్ట్ అయింది. సాప్ట్ వేర్ కంపెనీలు అన్ని వర్క్ ఫర్ హోమ్ సౌకర్యం కల్పిస్తున్నాయి.

భయంకరమైన కరోనా వ్యాప్తినిఅరికట్టేందుకు కేంద్రం మరిన్నికఠిన నిర్ణయాలు తీసుకుంది. అంతర్జాతీయ సరిహద్దులను మూసివేసింది. విమాన సర్వీసులను కుదించింది. భారత్- బంగ్లాదేశ్, సిక్కీం-భూటాన్, భారత్- నేపాల్ సరిహద్దులను ఏప్రిల్ 15వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. వైరస్ వ్యాప్తి కారణంగా ఏప్రిల్‌ 15 వ తేదీ వరకు భారత్- బంగ్లాదేశ్‌, సిక్కీం- భూటాన్ సరిహద్దుల వెంబడి ప్రయాణికుల రాకపోకల్ని నిలిపివేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 21న చేయాల్సిన గుజరాత్‌ పర్యటనను వాయిదా వేసుకున్నారు. సుప్రీంకోర్టు, ఢీల్లీ హైకోర్టులు కూడా కొన్ని నిబంధనలు విదించాయి. ఈ సోమవారం నుంచి అత్యవసర కేసులు తప్ప మిగిలినవేవీ విచారణ చేపట్టకూడదని నిర్ణయించించాయి. కోర్టు హాలులోకి లాయర్లను మినహా మరెవరినీ అనుమతించకూడదని తెలిపింది. దీనిలో భాగంగా కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ఉపయోగించే ఫేస్‌ మాస్క్‌లు, గ్లవుజులు, హ్యాండ్‌ శానిటైజర్లను నిత్యావసర వస్తువులుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటిని నిత్యావసర వస్తువుల చట్టం– 1955 పరిధిలోకి తీసుకువచ్చింది. దీంతో, వీటి ఉత్పత్తి, నాణ్యత, సరఫరా, ధరలను నియంత్రించే అవకాశం రాష్ట్రాలకు లభిస్తుంది. వాటిని అక్రమంగా పెద్ద ఎత్తున నిలవ చేయడం నేరమని కేంద్రం పేర్కొంది. వీటి ధరలను పెంచి అమ్మడం కూడా నేరమని పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story