భారత్‌లో 761కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

భారత్‌లో 761కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

మనదేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 761కు పెరిగింది. దేశవ్యాప్తంగా 18 మంది కరోనాతో మృతి చెందారు. అత్యధికంగా మహారాష్ట్రలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్‌లో ముగ్గురు చనిపోయారు. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో ఇద్దరేసి చొప్పున మృతి చెందారు. ఢిల్లీ, తమిళనాడు, బెంగాల్, బిహార్‌, పంజాబ్, జమ్మూకశ్మీర్‌లలో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాతపడ్డారు. మొత్తం బాధితుల్లో 71 మంది కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

రాష్ట్రాల వారీగా చూస్తే కేరళ, మహారాష్ట్ర టాప్ ప్లేస్‌లో ఉన్నాయి. కేరళలో 138, మహారాష్ట్రలో 135 కేసులు నమోదు చేశారు. కర్ణాటక-55, రాజస్థాన్‌-45, గుజరాత్‌-44, ఉత్తరప్రదేశ్‌-42, ఢిల్లీ-39, పంజాబ్‌-33, హర్యానా-32, తమిళనాడు 35, మధ్యప్రదేశ్‌లో 21 కేసులు నమోదయ్యాయి.

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో 47 కేసులు నమోదయ్యాయి. ఇవాళ కొత్తగా 2 కేసులు రికార్డయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో కేసుల సంఖ్య 12కు పెరిగింది.

కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు భారత సైన్యం సిద్ధమంటోంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు, పౌర సమాజాలు సాగిస్తున్న పోరాటంలో మేముసైతం.. భాగస్వాములం అవుతామని ఆర్మీ అంటోంది. కోవిడ్‌ రోగంపై సమరంలో ప్రభుత్వానికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ సవరణే ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story