కరోనా ప్రభావంతో భారీ స్థాయిలో పెరిగిన నిరుద్యోగులు

కరోనా ప్రభావంతో భారీ స్థాయిలో పెరిగిన నిరుద్యోగులు
X

కరోనా ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ప్రపంచదేశాలు ఆర్థికమాంద్యం దిశగా పయనిస్తున్నాయి. భారత్ కూడా అన్ని రంగాల్లో వెనకబడింది. కరోనా ప్రభావంతో భారతదేశంలో నిరుద్యోగం పెరిగిందని.. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సంస్థ చెప్తోంది. దీని ప్రకారం ఏప్రిల్ తొలి వారానికి దేశంలో నిరుద్యోగిత భారీగా పెరిగింది. మార్చిలో నిరుద్యోగిత 8.7శాతం ఉంది. 2016 సెప్టెంబర్ తర్వాత భారీ స్థాయిలో నిరుద్యోగ రేటు ఉన్నది ఇప్పుడే. అలాంటిది ఏప్రిల్ తొలి వారానికి ఈ నిరుద్యోగిత 23శాతానికి చేరింది. కరోనా ప్రబలుతుండటంతో కేంద్రము లాక్‌డౌన్ విధించటంతో ప్రైవేటు సంస్థల్లో పనిచేసే చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీనికి ప్రధాన కారణం ఆయా సంస్థలు ఉద్యోగులకు జీతాలిచ్చే స్థాయిలో లేకపోవడమేనని నిపుణులు అంటున్నారు.

Next Story

RELATED STORIES