రెడ్‌జోన్లకే లాక్‌డౌన్‌ను పరిమితం చేయాలి: సీఎం జగన్

రెడ్‌జోన్లకే లాక్‌డౌన్‌ను పరిమితం చేయాలి: సీఎం జగన్

రెడ్‌జోన్లకే లాక్‌డౌన్‌ను పరిమితం చేయాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. ప్రధాని మోడీతో అన్ని రాష్ట్రాల సీఎంలు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సందర్భంగా జగన్ తన అభిప్రాయాన్ని ఈ విధంగా తెలిపారు. జనం అధికంగా సంచరించే మాల్స్‌, సినిమా హాళ్లు, ప్రార్థనా మందిరాలపై ఇప్పుడున్న పరిస్థితి కొనసాగించి.. మిగతా ప్రాంతాల్లో భౌతికదూరం పాటించాలని అన్నారు. ఏపీలో 37 మండలాలు రెడ్‌జోన్‌లో ఉన్నాయని, 44 మండలాలు ఆరెంజ్‌ జోన్‌ లోనూ.. 595 మండలాలు గ్రీన్‌జోన్‌లో ఉన్నాయని మోదీకి జగన్ వివరించారు. అంత ఒకే రకమైన ఆలోచనతో ముందుకి సాగాలని, మీ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. ప్రధానిగా మీరు సూచించే వ్యూహంతో ముందుకు సాగుతామని జగన్‌ స్పష్టం చేశారు.

అటు రాష్ట్రంలో కరోనా ప్రభావం గురించి ప్రధానికి వివరించిన సీఎం జగన్.. లాక్‌డౌన్‌ వల్ల రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల రవాణా గణనీయంగా పడిపోయని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకు సరిపడా గోడౌన్లు లేవని.. ఆక్వా రంగం తీవ్రంగా దెబ్బతింటోందని వివరించారు. లాక్‌డౌన్‌ వల్ల పంపిణీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని.. రాష్ట్రానికి ఆదాయం కూడా రాని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అటు కరోనా లక్షణాలు ఉన్నవారిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తిస్తున్నామని.. 141 కంటైన్‌మెంట్‌ క్లస్టర్లను హాట్‌స్పాట్లుగా గుర్తించామన్నారు. 4 అత్యాధునిక ఆస్పత్రులను ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి జిల్లాకు ఒక కోవిడ్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేసుకున్నాం.

Tags

Read MoreRead Less
Next Story