సరైన సమయంలో సరైన నిర్ణయం.. భారత్‌లో లాక్‌డౌన్‌ పొడిగింపుపై డబ్ల్యూహెచ్‌ఓ స్పందన

సరైన సమయంలో సరైన నిర్ణయం.. భారత్‌లో లాక్‌డౌన్‌ పొడిగింపుపై డబ్ల్యూహెచ్‌ఓ స్పందన

భారత్‌లో రెండోసారి లాక్‌డౌన్‌ను విధించడంపై పలు అంతర్జాతీయ సంస్థలు స్వాగతిస్తున్నాయి. భారత్‌లో లాక్‌డౌన్‌ను మే 3 వరకూ పొడిగించడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. కరోనా కట్టడికి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించింది. ఏప్రిల్ 14తో మొదటి దశ లాక్‌డౌన్‌ ముగుస్తున్న నేపథ్యంలో.. కరోనాను పూర్తిగా అంతమొందించాలంటే మరిన్ని రోజులు స్వీయ నిర్బంధం అవసరమని.. మే నెల 3 వరకు లాక్‌డౌన్ పొడిగించారు. స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. లాక్‌డౌన్ పొడిగింపు నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రధాని నిర్ణయాన్ని డబ్ల్యూహెచ్‌ఓ దక్షిణాసియా ప్రాంతీయ డైరక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ స్వాగతించారు. లాక్‌డౌన్ కారణంగా సామాజిక దూరం పాటించేందుకు ఆస్కారం ఏర్పడుతుందని చెప్పారు. కరోనా లక్షణాలున్నవారిని సులువుగా గుర్తించేందుకు కూడా మార్గం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story