Top

ఏపీలో వెయ్యికి చేరువలో కరోనా కేసులు.. కొత్తగా 62..

ఏపీలో వెయ్యికి చేరువలో కరోనా కేసులు.. కొత్తగా 62..
X

ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 62 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 955కు చేరిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఏపీ ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం ఇప్పటి వరకు రాష్ట్రంలో 145 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, మొత్తం ఇప్పటివరకూ 29 మంది మృతి చెందారు. శుక్రవారం కరోనాతో అనంతపురంలో ఒకరు, కర్నూలులో ఒకరు మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసుల్లో కర్నూలులో 27, కృష్ణా జిల్లాలో 14, గుంటూరులో 11, అనంతపురంలో 4, ప్రకాశంలో 3, తూర్పు గోదావరి జిల్లాలో 2, నెల్లూరులో ఒకరికి పాజిటివ్‌‌గా నిర్ధారణ అయ్యింది.

కాగా.. కర్నూల్ లో, గుంటూరు లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. కర్నూల్ లో ఇప్పటివరకు 261 కేసులునమోదు కాగా.. గుంటూరు లో 206 కేసులునమోదయ్యాయి.

Next Story

RELATED STORIES