Top

ఏపీలో పంజా విసురుతున్న కరోనా.. కొత్తగా మరో 81కేసులు

ఏపీలో పంజా విసురుతున్న కరోనా.. కొత్తగా మరో 81కేసులు
X

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విస్తరిస్తుంది. గర్త 24 గంటల్లో 81 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,097కు చేరిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 52 కేసులు నమోదయ్యాయి. అటు పశ్చిమగోదావరి జిల్లాలో 12 కేసులు నమోదవ్వగా.. కర్నూలులో 4 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం, కడప, గుంటూరు జిల్లాలో చెరో 3 కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాలో 2 చొప్పున‌ కేసులు నమోదైయ్యాయి.మొత్తం కేసుల్లో కర్నూల్ లో అత్యధికంగా 279 కేసులు నమోదవ్వగా.. తరువాత కృష్ణ జిల్లాలో 177 నమోదయ్యాయి. అతి తక్కువగా శ్రీకాకుళంలో 3 కేసులు నమోదయ్యాయి. ఇంకా ఇప్పటివరకూ.. విజయనగరంలో ఇప్పటివరకు కేసులు నమోదుకాలేదు. రాష్ట్రంలో కరోనా వేగంగా విస్తరించటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Next Story

RELATED STORIES