Top

ఏపీలో మరో 82 కరోనా కేసులు.. కర్నూలులోనే 40..

ఏపీలో మరో 82 కరోనా కేసులు.. కర్నూలులోనే 40..
X

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వేగంగా విస్తరిస్తుంది. గత వారం రోజుల నుంచి కేసుల సంఖ్య బాగా పెరుగుతుంది. గడిచిన 24గంటల్లో 82 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1259కి చేరిందని వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటి వరకు 31 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 258 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అవ్వగా.. 31 మంది మృతి చెందారు. తాజాగా నమోదైన కేసుల్లో ఎక్కువగా కర్నూలులోనే 40 కేసులు బయటపడ్డాయి. ఇక గుంటూరులో 17, కృష్ణాలో 13 కేసులు నమోదైయ్యాయి. కడపలో 7, నెల్లూరులో 3 కేగులు నమోదుకాగా.. అనంతపురం, చిత్తూరులో ఒక్కో కేసులనుమోదైంది.

Next Story

RELATED STORIES