Top

ఏపీలో మరో 60 కరోనా కేసులు.. కర్నూలులో ఆగని మహమ్మారి విజృంభణ

ఏపీలో మరో 60 కరోనా కేసులు.. కర్నూలులో ఆగని మహమ్మారి విజృంభణ
X

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 60 పాజిటివ్‌ కేసులు నమోదైయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,463కి చేరిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 7,902 మందికి పరీక్షలు జరపగా.. 60 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని.. వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. ఇప్పటి వరకూ 403 మంది కరోనా రోగులు డిశ్చార్జి అవ్వగా.. 33 మంది మరణించారు. తాజాగా నమోదైన కేసుల్లో ఎక్కువగా 25 కేసులు కర్నూలు జిల్లాలో నమోదవ్వగా.. గుంటూరులో 19, అనంతపురం, కడపలో చెరో 6 కేసులు నమోదయ్యాయి. విశాఖ, పశ్చిమగోదావరిలో 2 చొప్పున నమోదయ్యాయి.

Next Story

RELATED STORIES