గుంటూరులో భారీ అగ్నిప్రమాదం..

X
TV5 Telugu9 May 2020 11:59 AM GMT
లాక్డౌన్‌తో దాదాపు అన్ని పరిశ్రమలు గత 45 రోజులు మూతపడి ఉన్నాయి. తాజాగా చేసిన సడలింపులతో పని మొదలు పెట్టాలని భావిస్తున్నాయి కొన్ని పరిశ్రమలు. ఇన్ని రోజులు మూతపడి ఉండడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి గుంటూరు జిల్లా చిలకలూరి పేట మండలం గంగన్న పాలెం రైస్ మిల్లులో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుండడంతో అగ్ని మాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నిమిషాల్లో అక్కడికి చేరుకుని మంటల అదుపుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అయితే దీని కారణంగా ప్రాణ నష్టం ఏదీ జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story