ఏపీలో 2000 దాటిన కరోనా కేసులు

ఏపీలో 2000 దాటిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కోరల చాస్తోంది. 24 గంటల్లో మరో 38 కరోనా కేసులు నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 2018కి పెరిగాయి. వీరిలో 975 మంది చికిత్స పొందుతుండగా.. 998 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 45 మంది మృతి చెందారు. జిల్లాల వారిగా చూస్తే గడిచిన 24 గంటల్లో చిత్తూరు, కర్నూలు జిల్లాలో చెరో 9 కేసులు.. అనంతపురంలో 8, గుంటూరులో 5, కృష్ణా లో3, విశాఖలో మూడు, నెల్లూరు 1 కేసు నమోదైంది.

ఇప్పటి వరకు ఓవరాల్‌గా పరిస్థితి చూస్తే.. కర్నూలు జిల్లాలో 575, గుంటూరు జిల్లాలో 387, కృష్ణాలో 342, చిత్తూరులో 121, అనంతపురం లో 115, నెల్లూరులో 102, కడపలో 97, పశ్చిమ గోదావరి జిల్లాలో 68, విశాఖపట్నంలో 66, ప్రకాశం జిల్లాలో 63, తూర్పుగోదావరి జిల్లాలో 46, శ్రీకాకుళంలో 5, విజయనగరంలో 4 కేసులు నమోదు కాదు.. వలస కూలీల్లో 27 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. అయితే దేశంలో అత్యధికంగా పరీక్షలు చేస్తుండడం వల్లే కేసులు సంఖ్య పెరుగుతోంది. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని అధికారులు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story