దేశంలో రోజురోజుకు పెరుగుతున్నకరోనా కేసులు.. కొత్తగా 6,767 కేసులు

దేశంలో రోజురోజుకు పెరుగుతున్నకరోనా కేసులు.. కొత్తగా 6,767 కేసులు
X

భారత్‌లో కరోనా రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతుంది. గడిచిన 24 గంటల్లో 6767 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,31,868కు చేరిందని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. అటు, గడిచిన 24 గంటల్లో 2,657 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకూ డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 54,440 చేరింది. మరోవైపు ఒక్కరోజులో దేశవ్యాప్తంగా147 కరోనా మరణాలు సంభవించగా.. ఇప్పటివరకూ మొత్తం 3867 మంది చనిపోయారు. ప్రస్తుతానికి దేశంలో 73,560 మంది కరోనా బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవ్వడంతో అధికారిక వర్గాల్లో ఆందోళన మొదలైంది. దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్రలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపుతుంది.

india corona

Next Story

RELATED STORIES