భారత్‌లో విస్తరిస్తున్న మహమ్మారి.. రోజుకి 6వేల కేసులు..

భారత్‌లో విస్తరిస్తున్న మహమ్మారి.. రోజుకి 6వేల కేసులు..

రెండు నెలల లాక్డౌన్ అనంతరం సడలింపుల్లో భాగంగా జనం రోడ్లపైకి వస్తున్నారు. కరోనా వారి కోసమే కాచుక్కూర్చున్నట్టుంది. వెంటనే అటాక్ చేస్తోంది. అందుకే గత నాలుగైదు రోజులుగా దేశంలో నిత్యం 6 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే కొత్త కేసులు 6535రాగా, 146 మరణాలు సంభవించడంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,45,380కి చేరింది. అయితే ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 4167 అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.

మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 60,491 మంది కోలుకోగా 80,722 మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది. గడచిన వారం రోజుల్లోనే దేశంలో దాదాపు 45 వేల పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. లాక్డౌన్ కాలంలో మొత్తంగా లక్ష కేసులు నమోదైతే.. కేవలం వారం రోజుల వ్యవధిలో 45వేల కేసులు నమోదవండంతో వైరస్ తీవ్రత ఎంత ఎక్కువగా ఉందీ తెలుస్తోంది. ఇక మహారాష్ట్ర, తమిళనాడు, దిల్లీ రాష్ట్రాల్లో అయితే కేసుల సంఖ్య రోజు రోజుకీ అధికమవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story