భారత్‌లో ఆగని కరోనా వ్యాప్తి.. 24 గంటల్లో 8380 కేసులు

భారత్‌లో ఆగని కరోనా వ్యాప్తి.. 24 గంటల్లో 8380 కేసులు
X

భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8 వేల 380 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్షా 82 వేల 143కు చేరింది.

గత 24 గంటల్లో దేశంలో 193 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5 వేల 164కు చేరింది. నిన్న ఒక్క రోజు 4 వేల 614 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారు.

ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇక్కడ గత 24 గంటల్లో 2 వేల 940 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 99 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య 65 వేల 168కి చేరింది.

ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఏపీలో గత 24 గంటల్లో తెలంగాణలో 74 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఎక్కువ శాతం గ్రేటర్‌లోనే నమోదవుతున్నాయి. ఏపీలోనూ నిన్న 131 కరోనా కేసులు నమోదయ్యాయి.

EZUfB2LWkAIq0gL

Next Story

RELATED STORIES