గుడ్ న్యూస్: భారత్‌లో చికిత్స పొందుతున్న వారి కంటే.. కరోనా నుంచి కోలుకున్న వారే ఎక్కువ

గుడ్ న్యూస్: భారత్‌లో చికిత్స పొందుతున్న వారి కంటే.. కరోనా నుంచి కోలుకున్న వారే ఎక్కువ

భారత్‌లో కరోనా విజృంభిస్తుంది. గత వారం రోజులుగా 9వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే, ఈ మధ్యలో ఓ శుభవార్తను కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం కరోనా చికిత్స పొందుతూ ఆస్పత్రిలో ఉన్నవారి కంటే కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య ఎక్కవైందని తెలిపారు. గడిచిన 24 గంటల్లో నమదైన కేసులు వివరాలు వెల్లడించిన ఆరోగ్యశాఖ.. దేశ వ్యాప్తంగా 1,33,632 మంది కరోనాతో పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతన్నారని.. అటు, 1,35,206 మంది రోగులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని అన్నారు. దీంతో కరోనా యాక్టివ్ కేసుల కంటే.. డిశ్చార్జ్ అయిన వారే ఎక్కవగా ఉన్నారని.. ఇది మరింత పెరిగి కోలుకున్న వారి సంఖ్య పెరగాలని కోరుకుంటున్నట్టు వైధ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వకరూ 2.76 లక్షల కరోనా కేసులు దేశవ్యాప్తంగా నమోదు కాగా.. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులో ఈ మహమ్మారి వ్యాప్తి ఉదృతంగా ఉంది. కాగా, దేశవ్యాప్తంగా 7,745 కరోనా మరణాలు నమోదయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story