భారత్‌లో కరోనా విజృంభణ.. ఒక్కరోజులో 15,516 కొత్త కేసులు

భారత్‌లో కరోనా విజృంభణ.. ఒక్కరోజులో 15,516 కొత్త కేసులు

దేశంలో కరోనా విజృంభణ తారాస్థాయికి చేరుతోంది. అన్ని రాష్ట్రాల్లోనూ మహమ్మారి విజృంభిస్తోంది. కేసుల విషయంలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. రోజువారీ కొత్త కేసుల సంఖ్య విపరీతం గా పెరుగుతోంది. తాజాగా ఒక్కరోజులో 15,516 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు రికార్డు కావడం ఇదే మొదటిసారి. కొత్త కేసులతో పాటు రోజువారీ మృతుల సంఖ్య కూ డా పెరిగింది. గత 24 గంటల్లో 375 మందికి పైగా చనిపోయారు. మొత్తంగా 13 వేల 280 మందికి పైగా కరోనాతో చనిపోయారు. మరణాల సంఖ్యలో ప్రపంచంలో భారత్‌ ఎనిమిదో స్థానంలో ఉంది.

దేశంలో గంటకు 604 మంది కరోనా బారిన పడుతున్నారు. ఐతే, రికవరీ రేటు కూడా భారీగా పెరుగుతోంది. యాక్టివ్ కేసులు, రికవరీ కేసుల మధ్య తేడా ఎక్కువగా ఉంటోంది. దేశవ్యాప్తంగా లక్ష 71 వేల పాజిటివ్ కేసులు ఉండగా, ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్ తర్వాత వైరస్ బారి నుంచి బయటపడుతున్న వారి సంఖ్య 2 లక్షల 29 వేలకు పెరిగింది. యాక్టివ్ కేసులు, రికవరీ కేసుల మధ్య తేడా 50 వేలకు పైగానే ఉంది. ప్రస్తుతానికి రికవరీ రేటు దాదాపు 55 శాతానికి చేరింది.

మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో కరోనా పంజా విసురుతోంది. ఆయా రాష్ట్రాల్లో జూన్‌ 1 నుంచి ఇప్పటివరకు 2 లక్షలకుపైగా కేసులు వెలుగులోకొచ్చాయి. దేశంలో ఇప్పటివర కు ముంబైపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉండగా, ఇప్పుడు ఆ స్థానంలోకి ఢిల్లీ వ‌చ్చిచేరింది. జూన్ 12 నుంచి ఢిల్లీలో ప్రతిరోజూ రెండువేల కేసులు నమోదవుతున్నాయి. ముంబైలో ఇంకా అలాంటి ప‌రి స్థితి రాలేదు. జూన్ 18 న ఢిల్లీ, చెన్నై న‌గ‌రాల్లో ముంబై క‌ంటే ఎక్కువగా కేసులు నమోద‌య్యాయి. ఢిల్లీలో క‌రోనా కేసులు దేశంలోని మిగిలిన‌ ప్రాంతాల కంటే అత్యంత వేగంగా రెట్టింపు అవుతున్నాయి. 12 రోజుల్లోనే ఇక్కడ కేసుల సంఖ్య రెట్టింపైంది. ఇప్పటివరకు దేశంలో ధృవీకరించిన‌ మొత్తం కేసులలో 13 శాతం ఢిల్లీలో మాత్రమే నమోదయ్యాయి. దేశంలో నమోదైన మొత్తం మరణాలలో 15 శాతానికి పైగా ఢిల్లీ నుంచే ఉన్నాయి.

ఢిల్లీలో ఒకవైపు కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తుంటే మరోవైపు కేజ్రీవాల్‌ ప్రభుత్వం, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మధ్య వివాదాలు చెలరేగుతున్నాయి. కరోనా రోగులు ఐదు రోజులు తప్పనిసరిగా ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌లో ఉండాలని ఎల్జీ అనిల్‌బైజాల్‌ జారీచేసిన ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి. దేశమంతా ఒక విధానం ఉంటే ఢిల్లీలో అందుకు భిన్నంగా ఎందుకు ఆదేశాలిచ్చారని సీఎం కేజ్రీవాల్‌ ప్రశ్నిం చారు. వివాదం ముదరటంతో ఎల్జీ తన ఆదేశాలను ఉపసంహరించారు. మరోవైపు ప్రభుత్వాస్పత్రుల్లో సిబ్బందికి సెలవులను రద్దు చేశారు. కరోనా రోగులకు వైద్యం చేయడానికి ప్రైవేటు దవాఖానలను కూడా సిద్ధం చేసినా బెడ్లు సరిపోవటంలేదు. దాంతో రైల్వే కోచ్‌లను కూడా తాత్కాలిక క్వారంటైన్‌ సెంటర్లుగా మార్చుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story