ప్రపంచవ్యాప్తంగా ఐదున్నర లక్షల కరోనా మరణాలు

X
By - TV5 Telugu |8 July 2020 8:03 PM IST
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. కొన్ని దేశాల్లో విరుచుకుపడుతోంది. మొత్తం కేసుల సంఖ్య కోటి 19 లక్షలకు పైగా నమోదయ్యాయి. మొత్తం కేసులు సంఖ్య 1,19,50,389కి చేరాయి. అటు మృతుల సంఖ్య 5,46,629కి చేరింది. ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా 68,95,547 మంది కోలుకున్నారు.
అటు, అమెరికాలో కరోనా కేసులు ప్రతీరోజు భారీ సంఖ్యలో నమోదయ్యాయి. న్యూజెర్సీ, న్యూయార్క్ లలో ఈ మహమ్మారి పంజా విసురుతోంది. ఇప్పటి వరకూ అమెరికాలో 30,97,084 కేసులు నమోదయ్యాయి. మరోవైపు భారత్ లో కూడా కరోనా విజృంభిస్తుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com