ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం.. కోటి 24 లక్షలకు చేరువలో కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం.. కోటి 24 లక్షలకు చేరువలో కేసులు

యావత్ ప్రపంచాన్ని కరోనా వణికిస్తుంది. ఇప్పటి వరకూ ఈ మహమ్మారి సోకిన వారి సంఖ్య కోటి 24 లక్షలకు చేరువలో ఉంది. అటు, మృతుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటి మొత్తం 1,23,89,559 మంది కరోనా కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 5,57,405కి చేరింది. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా ప్రభావం ఏమాత్రం తగ్గటంలేదు. న్యూయార్క్, న్యూజెర్సీ లలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అమెరికాలో ఇప్పటివరకూ 32,19,999 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. అందులో 1,35,822 మంది మృతి చెందగా.. 14,26,428 మంది కోలుకున్నారు. ఇక భారత్ లో కూడా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. కరోనా బాధితుల సంఖ్య ఎనిమిది లక్షలకు చేరువలో ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story