Ap New Cabinet : కేబినెట్‌లో చోటెవరికి.. ఏప్రిల్ 11న పునర్‍వ్యవస్థీకరణ జరిగే అవకాశం

YS Jagan (tv5news.in)

YS Jagan (tv5news.in)

Ap New Cabinet : కౌంట్‌డౌన్‌ మొదలైంది. మరో 10 రోజుల్లో మంత్రులంతా మాజీలవబోతున్నారు. ఏ ప్రాతిపదికన అమాత్యుల్ని మారుస్తున్నారు..

Ap New Cabinet : కౌంట్‌డౌన్‌ మొదలైంది. మరో 10 రోజుల్లో మంత్రులంతా మాజీలవబోతున్నారు. ఏ ప్రాతిపదికన అమాత్యుల్ని మారుస్తున్నారు.. సమర్థతా, సామాజిక సమీకరణాలా.. మరొక కారణం ఏమైనా ఉందా అనే చర్చకు ఛాన్సే లేదు..! CM జగన్‌ 2019 జూన్‌లోనే చెప్పినట్టు సగం టర్మ్‌ తర్వాత కేబినెట్‌ను పునర్‌వ్యవస్థీకరిస్తున్నారు. ప్రస్తుతం తెలుస్తోన్న సమాచారం బట్టి చూస్తే.. కేబినెట్‌ 25 మందిలో ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్లకు ఉధ్వాసన తప్పదు. ఏప్రిల్‌ 7వ తేదీన ఏపీ కేబినెట్ మీటింగ్ జరుగుతుంది.

అదే ప్రస్తుత మంత్రులకు ఆఖరి సమావేశం అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ మీటింగ్‌లోనే మార్పులు, చేర్పులపై CM స్పష్టత ఇస్తారని తెలుస్తోంది. అలాగే కేబినెట్ మీటింగ్ ముగిసిన మర్నాడే 8వ తేదీన గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ అడిగి బిశ్వబూషణ్‌ను కలిసి.. కేబినెట్లో మార్పుల్ని వివరిస్తారని సమాచారం. వచ్చే నెల 11వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుందని కూడా తెలుస్తోంది. అందుకు సంబంధించి సమయం ఇవ్వాలంటూ గవర్నర్‌ను కోరనున్నారు. వచ్చే నెల 7న కేబినెట్ భేటీ కాకుండా అదే రోజు విస్తరణ ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతున్నా దానిపై స్పష్టత లేదు.

ఏప్రిల్ 11న ఏపీ క్యాబినెట్ పునర్‍వ్యవస్థీకరణ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికలకు రెండేళ్లే ఉండడంతో సమూల మార్పులు చేయొచ్చని భావిస్తున్నారు. పైగా కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో జిల్లా నుంచి ఓ మంత్రి ఉంటారని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఐదు డిప్యూటీ సీఎం హోదాలను అలానే కొనసాగిస్తూ.. క్యాబినెట్‌లో ఒకరిద్దరిని మినహా పూర్తిగా పునర్‍వ్యవస్థీకరిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. ఆ ఒకరిద్దరిలో కర్నూలు జిల్లా నుంచి గుమ్మనూరు జయరాం, తూర్పు గోదావరి జిల్లా నుంచి వేణుకు మరో ఛాన్స్ ఇవ్వొచ్చని భావిస్తున్నారు. మిగతా స్థానాల్లో ఎవరెవరిని తీసుకుంటారనే దానిపై.. జిల్లా, సామాజికవర్గం ఆధారంగా ఎవరికి వాళ్లు లెక్కలు వేసుకుంటున్నారు.

జిల్లాల వారీగా చూస్తే.. శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు, తూర్పు గోదావరి జిల్లా నుంచి పొన్నాడ సతీష్‌కు అవకాశం ఇవ్వొచ్చని చెప్పుకుంటున్నారు. కృష్ణా జిల్లా నుంచి రేసులో పార్థసారథి, జోగి రమేష్ ఉండగా, గుంటూరు నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, విడదల రజిని, మేరుగ నాగార్జున, నెల్లూరు జిల్లా నుంచి కాకాణి, మేకపాటి కుటుంబసభ్యుల్లో ఒకరికి, చిత్తూరు జిల్లా నుంచి రోజా, భూమన కరుణాకర్ రెడ్డి, మధుసూదన్‍రెడ్డిలో ఒకరికి, కర్నూలు జిల్లా నుంచి చక్రపాణిరెడ్డి, కాటసాని రాంభూపాల్, కంగాటి శ్రీదేవి, అనంతపురం జిల్లా నుంచి కాపు రామచంద్రారెడ్డి, ఉషా చరణశ్రీ, జొన్నలగడ్డ పద్మావతి, కడప జిల్లా నుంచి శ్రీకాంత్‍రెడ్డి, రాచమల్లు, డా.సుధ, అరకు నుంచి ఫల్గుణ, పోలవరం నుంచి బాలరాజు పేర్లు వినిపిపిస్తున్నాయి.

ఇక కొడాలి నాని స్థానంలో వసంత కృష్ణప్రసాద్‌, పేర్నినాని ప్లేస్‍లో సామినేని ఉదయభాను, వెల్లంపల్లి స్థానంలో కోలగట్ల లేదా అన్నా రాంబాబు, అంజాద్‌ బాషా స్థానంలో ఈసారి హఫీజ్‍ఖాన్‍కు, బొత్స స్థానంలో కోలగట్ల వీరభద్రస్వామి లేదా బొత్స అప్పలనర్సయ్య, పుష్పశ్రీ వాణి ప్లేస్‍లో రాజన్నదొర లేదా భాగ్యలక్ష్మి, అవంతి స్థానంలో గుడివాడ అమర్నాథ్‍, ఆదిమూలపు సురేష్‌ స్థానంలో సుధాకర్‍బాబుకు అవకాశం ఇస్తారనే చర్చ జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story