పాఠశాలల్లో ఫోన్ నిషేధం.. విద్యార్థులతో పాటు టీచర్లు కూడా

పాఠశాలల్లో ఫోన్ నిషేధం.. విద్యార్థులతో పాటు టీచర్లు కూడా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని నిషేధించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని నిషేధించింది. విద్యార్థులకే కాదు ఈ ఉత్తర్వులు తరగతి గదుల్లో ఉపాధ్యాయులు సైతం మొబైల్ ఫోన్ వినియోగించరాదని ఆర్డర్స్ పాస్ చేసింది ప్రభుత్వం.

తరగతి గదికి వెళ్లే ముందు ఉపాధ్యాయులు తమ మొబైల్‌ ఫోన్‌లను హెడ్‌మాస్టర్‌కు అందజేయాలని కోరింది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ఆధారంగా ఈ ఉత్తర్వులు వచ్చినట్లు పేర్కొంది.

ఉపాధ్యాయ సంఘాలు, ఇతర వాటాదారులతో సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ తెలిపింది. పాఠశాలల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.

పాఠశాలల్లో నిబంధనలను కచ్చితంగా అమలు చేసేలా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ సూచించింది.

Tags

Read MoreRead Less
Next Story