AP Cabinet: ఏపీ కొత్త కేబినేట్ తుది జాబితా విషయంలో ట్విస్ట్..

AP Cabinet: ఏపీ కొత్త కేబినేట్ తుది జాబితా విషయంలో ట్విస్ట్..
AP Cabinet: ఏపీ మంత్రుల తుది జాబితా సీల్డ్‌ కవర్ సిద్ధమైంది. అయితే, చివరి నిమిషంలో ట్విస్ట్‌ చోటు చేసుకుంది.

AP Cabinet: ఏపీ మంత్రుల తుది జాబితా సీల్డ్‌ కవర్ సిద్ధమైంది. అయితే, చివరి నిమిషంలో ట్విస్ట్‌ చోటు చేసుకుంది.. కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడుతుందనుకునే టైమ్‌లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ట్విస్ట్‌ ఇచ్చారు.. కేబినెట్‌ కూర్పుపై కసరత్తు పూర్తయిందని, రాత్రి ఏడు గంటలకు రాజ్‌భవన్‌కు కొత్త జాబితా వెళ్తుందని చెప్పారు.. కొత్త జాబితాతో సాయంత్రం జీఏడీ అధికారులు రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు..

ఇక కొత్తగా కేబినెట్‌లో చోటు దక్కించుకున్న వారికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్తున్నాయి.. అటు 24 మంది మంత్రుల రాజీనామాలను గవర్నర్‌ ఆమోదించారు.. దీనికి సంబంధించి కాసేపల్లో గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడనుంది. మరోవైపు అసంతృప్తులను బుజ్జగించే కార్యక్రమం కూడా కొనసాగుతోంది. తుది జాబితా ప్రకటించిన తర్వాత రేపు కొత్త మంత్రివర్గం కొలువుదీరనుంది.. ఉదయం 11గంటల 31 నిమిషాలకు కొత్త మంత్రివర్గం సమావేశం కానుంది.

పాతవారిలో 9 మందికి కేబినెట్‌లో మరోసారి ఛాన్స్‌ లభించనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు ఛాన్న్ వచ్చే అవకాశం లభించనున్నట్లు తెలుస్తోంది. పెనమలూరు నుంచి ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధికి ఛాన్స్‌ దక్కనుంది. యాదవ సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్న మాజీ మంత్రి పార్ధసారధికి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది.

అయితే కాపు సామాజిక వర్గంలో ముఖ్యనేతగా ఉన్న అంబటి రాంబాబుకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు అర్ధమవుతుంది. వీరిద్దిరికి ఫైనల్ లిస్టులో చోటు దక్కితే మంత్రివర్గ కూర్పులో సమీకరణాలు మారనున్నాయి. ఏపీ కొత్తకేబినెట్ లో విజయనగరం నుంచి బొత్ససత్యనారాయణను కొనసాగించే అవకాశం ఉంది. ఇదే జిల్లా నుంచి రాజన్నదొరలకు అవకాశం లభించనున్నట్లు తెలుస్తోంది.

ఇక శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావుతోపాటు.. సీదిరి అప్పలరాజుకు మంత్రివర్గంలో ఛాన్స్‌ లభించే అవకాశం ఉంది. విశాఖనుంచి కొత్తగా భాగ్యలక్ష్మికి ... గుడివాడ అమర్నాధ్‌కు కేబినెట్‌లో చోటు లభించనుంది. తూర్పుగోదావరి జిల్లా నుంచి దాడిశెట్టి రాజా, చిట్టిబాబు, వేణుగోపాల్‌కు అవకాశం అభించనున్నట్లు తెలుస్తోంది.

ఇక పశ్చిమ గోదావరి జిల్లానుంచి కారుమూరి నాగేశ్వర రావు, గ్రంధి శ్రీనివాస్ లుకు, కృష్ణా జిల్లా నుంచి జోగి రమేష్‌ అవకాశం కల్పిస్తూ.. కొడాలి నాని కొనసాగించనున్నారు. రక్షణనిధికి కొత్తకేబినెట్‌లో బెర్తు ఖరారైనట్లు తెలుస్తుంది. ఇక గుంటూరు జిల్లా నుంచి విడదల రజని కొనసాగించే అవకాశం ఉంది. కొత్తగా మేరుగు నాగార్జునకు అవకాశం దక్కనుంది. నెల్లూరు నుంచి కాకాని గోవర్దన్ రెడ్డి ఛాన్స్ లభించనుంది.

చిత్తూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కొత్తకేబినెట్‌లో కొనసాగనున్నారు. కడప జిల్లా నుంచి అంజాద్ బాషా.. కొరుముట్ల శ్రీనివాస్ కొత్తగా అవకాశం లభించనుంది. కర్నూలు నుంచి మరోసారి గుమ్మనూరు జయరాం కొనసాగనుండగా.. శిల్పా చక్రపాణికి అవకాశం దక్కనుంది. అనంతపురం నుంచి జొన్నలగడ్డ పద్మావతి అవకాశం లభించనుండగా.. శంకర్ నారాయణను కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story