హైకోర్టులో ఏపీ ప్రభుత్వం హౌస్‌మోషన్ పిటిషన్

హైకోర్టులో ఏపీ ప్రభుత్వం హౌస్‌మోషన్ పిటిషన్

స్థానిక ఎన్నికలకు సంబంధించి బుధవారం ఏపీలో కీలక బేటీ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలా వద్దా అన్న విషయమై రాజకీయ పార్టీలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ అఖిలపక్ష సమావేశం ఉదయం 10.40 నిమిషాలకు జరగనుంది. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి గుర్తింపు పొందిన అన్ని పార్టీలకు ఎన్నికల సంఘం ఆహ్వానం పంపింది. ఎన్నికల నిర్వహణపై ఆయా పార్టీల అభిప్రాయాలు, సూచనలను ఎన్నికల సంఘం తీసుకోనుంది. హైకోర్టు ఎన్నికలు జరపాలా ? వద్దా? తేల్చండి అంటూ ఈసీకి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలోనే పార్టీలో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.. పార్టీలతో మాట్లాడి, అభిప్రాయాలు తీసుకున్న తర్వాత హైకోర్టుకు తెలియనున్నట్లు తెలుస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం అఖిలపలక్ష సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఎస్‌ఈసీ అఖిలపక్ష సమావేశ నిర్వహణను నిలిపివేయాలని ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ అన్ని పార్టీలతో కలిసి సమావేశం ఏర్పాటు చేయడానికి సిద్దమైంది. అయితే ఈ భేటీకి హాజరుకాకూడదని అధికార వైసీపీ నిర్ణయం తీసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story