AP Genco: అప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్.. ఇప్పుడు ఏపీ జెన్‌కో.. ప్రభుత్వం నుండి ప్రైవేట్‌కు..

AP Genco: అప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్.. ఇప్పుడు ఏపీ జెన్‌కో.. ప్రభుత్వం నుండి ప్రైవేట్‌కు..
AP Genco: YSR హయాంలో ప్రారంభించిన కృష్ణపట్నం జెన్‌కో ప్లాంట్‌ను.. ప్రైవేట్‌‌కు అప్పజెప్పేందుకు ప్రయత్నాలు వేగవంతమయ్యాయి.

AP Genco: YSR హయాంలో ప్రారంభించిన కృష్ణపట్నం జెన్‌కో ప్లాంట్‌ను.. ఇప్పుడు ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పజెప్పేందుకు ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. ఐతే జగన్‌ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఏపీ జెన్‌కో ఉధ్యోగులు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యుత్‌ సంస్థ జెన్‌కోకు ప్లాంట్‌ ఉండాలన్న ఉద్దేశంతో దామోదరం సంజీవయ్య విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రానికి ఆనాటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ఇప్పుడు దానిని లీజు పేరిట ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పేందుకు జగన్‌ సర్కార్ సిద్ధం అయింది. నష్టాల సాకు చూపి..ప్రస్తుత ప్రభుత్వంలోని పెద్దలకు సన్నిహిత సంస్థకు కట్టబెట్టెందుకు ఇంధనశాఖ వేగంగా అడుగులు వేస్తోంది. విద్యుత్‌ ఉత్పత్తి, సర్‌ ఛార్జీలలో వ్యత్యాసాన్ని ప్రధాన కారణంగా చూపుతున్నారు. కృష్ణపట్నం విద్యుత్‌ కేంద్రాన్ని ప్రైవేట్‌కు లీజుకిసస్తున్నట్లు గత నెల 21వ తేదీన కేబినెట్‌ నిర్ణయం తీసుకోవడంతో.. ఉద్యోగులు, భూములిచ్చిన వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

లీజుకు సంబంధించి ప్రకటన జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. వైఎస్సార్ సీఎంగా ఉన్న టైంలో నెల్లూరు జిల్లా నేలటూరులో ఈ ప్లాంటుకు శంకుస్థాపన చేశారు. 4 వేల 800 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్లాంటుకు శ్రీకారం చుట్టారు. తర్వాత ఏకంగా 8 వేల 200 కోట్లకు ఖర్చు పెరిగింది. అంచనా వ్యయం రెట్టింపు కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

ఇటీవల కాలంలో ఈ ప్లాంట్‌ను స్వాధీనం చేసుకోవాలని NTPCని కోరింది కేంద్రం. అధిక వ్యయం కారణంగా తాము తీసుకోలేమంటూ NTPC తేల్చి చెప్పింది. ఈ ప్లాంట్ కోసం 5 వేల కోట్ల దాకా RFCPFC వంటి కేంద్ర ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకోవడం, క్యాపిటల్ వ్యయం కోసం మరో 3 వేల 500 కోట్లు అప్పులు చేయడంతో నిర్వహణ జెన్‌కోకు భారంగా మారింది.

సామర్థ్యం కలిగిన ఇంజినీరింగ్ సిబ్బందితో ఇత ర ప్రైవేట్ ప్లాంట్లతో పోటీ పడుతున్న ఈ సంస్థను ఇప్పుడు ప్రైవేట్‌ అప్పజెప్పాలన్న ప్రభుత్వ నిర్ణయం విమర్శలకు దారి తీస్తోంది. తొలి దశలో 800మెగావాట్ల చొప్పున నిర్వహించిన రెండు యూనిట్లపై REC, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ల నుంచి జెన్‌ కో 8 వేల కోట్ల రుణం తీసుకుంది. తర్వాత మూడో యూనిట్ నిర్వహణ కోసం 12 వేల కోట్లు రుణం తీసుకుంది.

మూడో యూనిట్ ఇంకా ప్రారంభం కాలేదు. వచ్చే నెలలో ప్రారంభించేందుకు ఇంధన శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇంతలోనే మొదటి రెండు ప్లాంట్లను ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇచ్చేందుకు జగన్‌ సర్కార్ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఈ యూనిట్ల వ్యయం రెట్టింపు కావడంపై ఇటీవల కేంద్ర విద్యుత్‌ సంస్థ సందేహం వ్యక్తం చేసింది. దీనిపై అధ్యయనం కోసం కమిటీ కూడా వేసింది.

కృ ష్ణపట్నం ప్లాంటు విలువ 7 వేల 500 కోట్ల నుంచి 8000 వేల కోట్ల వరకు ఉంటుందని నివేదిక అందించింది. ఈ ప్లాంట్‌ను విక్రయించినా అప్పులు తీరవని నిపుణులు చెప్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించాలంటే ముందస్తుగా అప్పులన్ని తీర్చేయాలని కేంద్రం ఇంధన సంస్థలు చెప్తున్నాయి. కృష్ణపట్నం ప్లాంటును ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడాన్ని నిరసిస్తూ ఉద్యమానికి సిద్ధం అవుతున్నారు ఉద్యోగులు.

విధుల్లో పాల్గొంటూనే నిరసన తెలియజేస్తున్నారు. వీరికి మద్ధతుగా ఆనాడూ ప్లాంటు కోసం భూములిచ్చిన నాలుగు గ్రామాల ప్రజలు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఆనాడూ నిర్వాసితులను మరో చోటుకి తరలించి..కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీలు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పితే తమ పిల్లల భవిష్యత్‌ ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story