Chandrababu: చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..

Chandrababu: చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..
రెగ్యులర్ బెయిల్ మంజూరు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ రిలీఫ్ దొరికింది. స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులోనే చంద్రబాబు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పైన ఉన్నారు. ఆరోగ్యానికి సంబంధిత కారణాలతో మధ్యంతర బెయిల్ కోర్టు మంజూరు చేసింది. ఇక, ఇప్పుడు సుప్రీం కోర్టులో వాదనలు పూర్తయిన క్వాష్ పిటీషన్ పైన తీర్పు వెల్లడి కావాల్సి ఉంది. 53 రోజులు జైలు లో రిమాండ్ లో ఉన్న చంద్రబాబు కు ఈ తీర్పు భారీ ఉపశమనంగా మారనుంది.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో గత వారమే విచారణ పూర్తి చేసింది. స్కిల్ కేసులో సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఎన్నికల ముంగిట చంద్రబాబును కక్షపూరితంగా అరెస్ట్ చేశారని లూథ్రా వాదించారు. చంద్రబాబు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కోర్టుకు వివరించారు. చంద్రబాబును ఇరికించడం కోసమే ఫోరెన్సిక్ రిపోర్టు తయారు చేశారని లూథ్రా ఆరోపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ విచారణ సమయంలో అనారోగ్య కారణలతో మధ్యంతర బెయిల్ కోర్టు మంజారు చేసింది. యాభై రెండు రోజుల పాటు రాజమండ్రిలో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు బయటకు వచ్చారు. ఆ సమయంలో కొన్ని కండీషన్లు స్పష్టం చేసింది. ఈ నెల 28న చంద్రబాబు తిరిగి జైలులో సరెండర్ కావాలని సూచించింది. మరో వారం రోజుల్లో ఈ సమయం ముగుస్తుండటంతో రెగ్యులర్ బెయిల్ పైన తీర్పు ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్దించారు. C

ఈనెల 29 నుంచి చంద్రబాబు రాజకీయ ర్యాలీల్లో నేరుగా పాల్గొనవచ్చని వెల్లడించింది. దీంతో ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇప్పటికే స్కిల్ కేసులో చంద్రబాబుకు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్ సస్పెండ్ చేయాలని, FIR క్వాష్ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా గతంలోనే వాదనలు పూర్తయ్యాయి. గత నెలలో తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం రిజర్వ్ చేసింది. దీపావళి సెలవుల అనంతరం తీర్పు ప్రకటిస్తామని ధర్మాసనం చెప్పింది. రేపో, మపో సుప్రీం ధర్మాసనం తీర్పు ప్రకటించనుంది.


Tags

Read MoreRead Less
Next Story