AP New Districts: ఏపీలో ఘనంగా ప్రారంభమైన కొత్త జిల్లాలు.. బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్లు..

AP New Districts: ఏపీలో ఘనంగా ప్రారంభమైన కొత్త జిల్లాలు.. బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్లు..
AP New Districts: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవాలు ఘనంగా జరిగాయి.

AP New Districts: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవాలు ఘనంగా జరిగాయి. దీనిలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా ఢిల్లీరావు బాధ్యతలు చేపట్టారు. గొప్ప వ్యక్తిపేరుమీద జిల్లాలను ఏర్పాటుచేయడం.. ఆ జిల్లాకు తనకు బాధ్యతలు అప్పగించడంపై ఆయన ఆనంద వ్యక్తంచేశారు. అందరి సహాకారంతో జిల్లాను అభివృద్ది చేస్తానన్నారు.

పార్వతీపురం మన్యం జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయ భవనాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి ప్రారంభించారు. నాలుగు నియోజవర్గాల పరిధి, 15 మండలాలతో కొత్తజిల్లా ఏర్పడింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని స్థానికులు ఆనందం వ్యక్తంచేశారు. కోనసీమ మన్యం జిల్లా కలెక్టర్‌గా హిమాన్ష్ శుక్ల బాధ్యతలు స్వీకరించారు.

మరో 15 రోజుల్లో జిల్లా కార్యాలయం పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తామన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి .. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేలా కృషిచేస్తానన్నారు. అందరిని కలుపుకొని ముందుకు సాగుతానని కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా ప్రారంభోత్సవం కోలాహాలంగా జరిగింది. నరసరావు పేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ప్రారంభోత్సవం నిర్వహించారు.

కలెక్టర్ కార్యాలయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి వర్చువల్ ల్లో ప్రారంభోత్సవం చేశారు. ఎల్ శివశంకర్ నూతన జిల్లా కలెక్టర్‌, ఎస్పీలు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అల్లూరు సీతారామ రాజు జిల్లా కలెక్టర్‌గా సుమీత్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా జెండా ఎగురవేసి లాంచనంగా అల్లూరుసీతారామ రాజు జిల్లాను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ జాయింట్ కలెక్టర్ జీ. ఎస్ ధనుంజయ్ తోపాటు స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు కాకినాడ నూతన జిల్లా కలెక్టర్‌గా కృత్తికా శుక్లా బాధ్యతలు చేపట్టారు. నూతన జిల్లాకు తొలి మహిళా కలెక్టర్ గా బాధ్యలు స్వీకరించారు. జిల్లా ఎస్పీగా రవీంద్ర బాబుతోపాటువివిధ విభాగాల అధికారులు ఈసందర్బంగా బాధ్యతలు చేపట్టారు.

జిల్లా కలెక్టర్‌గా ఇక్కడికి రావడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు కృత్తికా శుక్లా. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పనులపై దృష్టిపెడుతానని అన్నారు. ప్రకాశం జిల్లా 37వ కలెక్టర్‌గా దినేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. జిల్లాల పునర్ విభజన తర్వాత రాష్ట్రంలో పెద్దజిల్లాల్లో ఒకటి ప్రకాశం జిల్లా ఉందన్నారు .

జిల్లాకు ప్రధానమైన వెలుగొండ ప్రాజెక్టు ను వేగంగా పూర్తిచేసి సాగు,తాగునీరు అందిస్తా అన్నారు. ఏపీలో జిల్లాల పునర్ విభజనలో భాగంగా 13 జిల్లాలు కాస్తా 26 జిల్లాలుగా ఏర్పడ్డాయి.దీంతో ఆయా జిల్లాలకు జిల్లా కలెక్టర్‌తోపాటు సంబంధిత అధికారులు బాధ్యతలు చేపట్టారు. అయితే డివిజన్లు, జిల్లా కేంద్రాల ఏర్పాటు విషయంలో ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story