శ్రీకాకుళం జిల్లా టీడీపీ మద్దతుదారులపై వైసీపీ కార్యకర్తల దాడి

శ్రీకాకుళం జిల్లా టీడీపీ మద్దతుదారులపై వైసీపీ కార్యకర్తల దాడి
ఓటమిని తట్టుకోలేని వైసీపీ వర్గీయులు తమపై దాడి చేశారని టీడీపీ కార్యకర్తలు చెప్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా వంగర మండలం శ్రీహరిపురంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణతో గ్రామంలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. నిన్న పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారు విజయం సాధించారు. ఆ తర్వాత మొదలైన గొడవ చినికిచినికి గాలివానగా మారింది. ఓటమిని తట్టుకోలేని వైసీపీ వర్గీయులు తమపై దాడి చేశారని టీడీపీ కార్యకర్తలు చెప్తున్నారు. కావాలనే తమ వాళ్లను టార్గెట్ చేసి కొట్టారంటున్నారు.

ఈ విషయంలో పోలీసులు కూడా వైసీపీ నేతలకే కొమ్ముకాస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తలెత్తిన ఈ గొడవ వ్యక్తిగత ప్రతిష్టల వరకూ వెళ్లడంతో వివాదం మరింత పెద్దదైంది. YCP నేతలు కావాలనే రెచ్చగొట్టేలా వ్యవహరించి దాడులు చేస్తున్నారని టీడీపీ వాళ్లు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. గ్రామంలో పోలీసుల్ని మోహరించారు.


Tags

Read MoreRead Less
Next Story