AP New Cabinet: ఏపీ కేబినెట్‌లో చివరి నిమిషంలో అనూహ్య మార్పులు.. మారిన సామాజిక వర్గ సమీకరణాలు..

AP New Cabinet: ఏపీ కేబినెట్‌లో చివరి నిమిషంలో అనూహ్య మార్పులు.. మారిన సామాజిక వర్గ సమీకరణాలు..
AP New Cabinet: ఏపీ మంత్రివర్గ కూర్పులో చివరి నిమిషంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి.

AP New Cabinet: ఏపీ మంత్రివర్గ కూర్పులో చివరి నిమిషంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి.. 25 మందితో ప్రకటించిన తాజా మంత్రివర్గం పాత, కొత్తల కలయికగా ఉంది.. పాత మంత్రులను 10 మందిని కొనసాగిస్తుండగా.. కొత్తగా 15 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు.. అటు కేబినెట్‌లో సామాజిక వర్గ సమీకరణాలు కూడా మారిపోయాయి.. మంత్రివర్గంలో బీసీలకు పెద్ద పీట వేశారు సీఎం జగన్‌..

అదే సమయంలో కమ్మ, వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియులకు కేబినెట్‌లో చోటు దక్కలేదు.. ఇక కృష్ణా జిల్లా నుంచి ఒక్కరికే ఛాన్స్‌ దక్కింది.. మరోవైపు పీకేసిన మంత్రులకు నామినేటెడ్‌ పోస్టులు ఇస్తామని ఆశ చూపించినట్లుగా ప్రచారం జరుగుతోంది.. మొత్తంగా జగన్‌ మంత్రివర్గంలో రెడ్డి సామాజికవర్గం నుంచి నలుగురు, కాపు సామాజిక వర్గం నుంచి నలుగురు, బీసీలు 10, ఐదుగురు ఎస్సీలు, ఒక ఎస్టీ, ఒక మైనార్టీకి మంత్రి పదవులు లభించాయి..

ఇక జిల్లాల వారీగా మంత్రి పదవులు లభించిన వారి వివరాలు చూస్తే... శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజుకు కేబినెట్‌లో చోటు దక్కింది.. విజయనగరం నుంచి బొత్స సత్యనారాయణను కేబినెట్‌లో కొనసాగిస్తుండగా.. కొత్తగా రాజన్నదొరకు ఛాన్స్‌ ఇచ్చారు.. విశాఖ నుంచి గుడివాడ అమర్నాథ్‌, బూడి ముత్యాల నాయుడికి ఛాన్స్‌ దక్కింది..

తూర్పుగోదావరి జిల్లా నుంచి దాడిశెట్టి రాజాను కొత్తగా కేబినెట్‌లోకి తీసుకోగా.. చెల్లుబోయిన వేణుగోపాల్‌, పినిపె విశ్వరూప్‌ను కొనసాగిస్తున్నారు.. పశ్చిమగోదావరి జిల్లా నుంచి తానేటి వనితను మంత్రిగా కొనసాగిస్తుండగా.. కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణకు కొత్తగా అవకాశం ఇచ్చారు.. కృష్ణా జిల్లా నుంచి జోగి రమేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు.. ఇక గుంటూరు జిల్లా నుంచి అంబటి రాంబాబు, విడదల రజినీ, మేరుగ నాగార్జునకు కేబినెట్‌లో ఛాన్స్‌ ఇచ్చారు..

అలాగే నెల్లూరు జిల్లా నుంచి కాకాణి గోవర్ధన్‌ రెడ్డికి మంత్రి పదవి వరించింది.. కడప నుంచి అంజాద్‌ బాషాను కొనసాగిస్తుండగా కర్నూలు నుంచి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, గుమ్మనూరు జయరాంను మంత్రులుగా కొనసాగిస్తున్నారు.. చిత్తూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామిని కొనసాగిస్తుండగా.. ఆర్కే రోజాను కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. ఇక అనంతపురం జిల్లా నుంచి ఉషాచరణ్‌ శ్రీ, తిప్పేస్వామిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story