Balakrishna : ఇవాళ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ర్యాలీ, మౌనదీక్ష

Balakrishna : ఇవాళ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ర్యాలీ, మౌనదీక్ష
Balakrishna : కొత్త జిల్లాల అంశంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వివిధ ప్రాంతాల్లో విపక్షాలు, ప్రజా సంఘాలు తమ నిరసనలు కొనసాగిస్తున్నాయి.

Balakrishna : కొత్త జిల్లాల అంశంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వివిధ ప్రాంతాల్లో విపక్షాలు, ప్రజా సంఘాలు తమ నిరసనలు కొనసాగిస్తున్నాయి. ఇక.. కొత్త జిల్లాల పంచాయితీ హస్తినకు చేరింది. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద రాజంపేట వాసులు ఆందోళన నిర్వహించారు. ఎన్నికల సమయంలో రాజంపేట కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తానని జగన్‌ హామీ ఇచ్చారని.. కానీ ఇప్పుడు రాయచోటి జిల్లా ప్రకటించారని మండిపడ్డారు. ప్రశాంతతకు మారుపేరైన రాజంపేటను జిల్లా కేంద్రం చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురాన్ని నూతన జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్త పరిస్థితికి దారి తీసింది. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు కార్యకర్తలు ప్రయత్నించగా..పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు వర్గీయులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసుల వైఖరిపై తీవ్రంగా మండిపడ్డ మాధవనాయుడు వర్గీయులు.. వారు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు.

నరసరావుపేట పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా జిల్లాగా నామకరణం చేయాలంటూ జాషువా సాధన సమితి రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. వారికి నరసరావుపేట టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు సంఘీభావం తెలిపారు. నరసరావుపేట జిల్లాను జాషువా జిల్లాగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

హిందుపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇవాళ పట్టణంలో ర్యాలీ నిర్వహించనున్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ జరగనుంది. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద మౌన దీక్ష చేపట్టనున్నారు. ఉద్యమ కార్యాచరణపై సాయంత్రం అఖిలపక్ష నేతలతో చర్చించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story