వైసీపీకి బిగ్ షాక్.. మాగుంట రాజీనామా

వైసీపీకి బిగ్ షాక్.. మాగుంట  రాజీనామా

వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీని వీడాల్సి వచ్చిందని తెలిపారు. రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.

‘‘ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే ఒక బ్రాండ్‌. 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. 11 సార్లు చట్టసభలకు పోటీ చేశా. మా కుటుంబానికి అహం లేదు.. ఉన్నదల్లా ఆత్మగౌరవమే. కొన్ని అనివార్య పరిస్థితుల్లో వైసీపీను వీడుతున్నాం. బాధాకరమే అయినా తప్పడం లేదు. ఒంగోలు ఎంపీ బరిలో నా కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని నిలపాలని నిర్ణయించాం’’ అని మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.

మాగుంట శ్రీనివాసులరెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1998, 2004, 2009 ఎన్నికల్లో ఒంగోలు ఎంపిగా కాంగ్రెస్‌ పార్టీ తరుపున గెలిచారు. ఆయన 1999లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా, 2014 ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుధేశం పార్టీలో చేరి 2014లో ఒంగోలు ఎంపిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఆయన 2015లో ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల తరుపున శాసనమండలి సభ్యునిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

మాగుంట శ్రీనువాసులు రెడ్డి 2019 మార్చి 16న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఒంగోలు లోక్ సభ స్థానం నుండి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు.

Tags

Read MoreRead Less
Next Story