ఆంధ్రప్రదేశ్

Chandrababu Meeting : విశాఖ రాజధాని అంటూ ప్రభుత్వ మాయమాటలను ప్రజలు నమ్మడంలేదు..!

Chandrababu Meeting : విశాఖ రాజధాని అంటూ ప్రభుత్వం చెపుతున్న మాయమాటలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.

Chandrababu Meeting : విశాఖ రాజధాని అంటూ ప్రభుత్వ మాయమాటలను ప్రజలు నమ్మడంలేదు..!
X

chandrababu naidu (File Photo)

Chandrababu Meeting : విశాఖ రాజధాని అంటూ ప్రభుత్వం చెపుతున్న మాయమాటలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu Naidu). మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఇది స్పష్టమవుతోందన్నారు. అమరావతి(Amaravati)లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబునాయుడు విశాఖ(Visakhapatnam) కార్పొరేటర్లు, నేతలతో సమావేశమయ్యారు. గత సార్వత్రిక ఎన్నికల్లోను నాలుగు స్థానాల్లోను గెలుపొందామని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ(TDP)కి విశాఖ కంచుకోటగా ఉందన్నారు. విశాఖ ప్రజల నమ్మకానికి అనుగుణంగా నగరవాసులకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా టీడీపీ అండగా ఉంటుందన్నారు. చేసిన అభివృద్దినంతా నాశనం చేస్తూ అధికార పార్టీ కబ్జాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలోకి వస్తే .. విశాఖ అభివృద్ధిలో నెక్స్ట్ లెవల్‌కు వెళ్లిపోయేదన్నారు.

Next Story

RELATED STORIES