మాస్క్ లేకుండా బయటకు వచ్చిన CIకి ఫైన్

మాస్క్ లేకుండా బయటకు వచ్చిన CIకి ఫైన్
కరోనా మళ్లీ కోరలు చాస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనల్ని కఠినతరం చేశారు. మాస్క్ లేకుండా బయటకు వస్తే ఫైన్లూ వేస్తున్నారు.

కరోనా మళ్లీ కోరలు చాస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనల్ని కఠినతరం చేశారు. మాస్క్ లేకుండా బయటకు వస్తే ఫైన్లూ వేస్తున్నారు. ప్రజల్లో కోవిడ్ జాగ్రత్తలపై అవగాహన పెంచేందుకు ఇవాళ గుంటూరులో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఎస్పీ అమ్మిరెడ్డి లాడ్జ్ సెంటర్‌, MTB కూడలిలో స్పెషల్ డ్రైవ్‌లో పాల్గొన్నారు.

ఆ సమయంలో తుళ్లూరు ట్రాఫిక్ CI మల్లిఖార్జున్‌రావు మాస్క్ లేకుండా అటుగా వెళ్తుండడాన్ని SP గుర్తించారు. వెంటనే CIని ఆగమని చెప్పారు. కరోనా నిబంధనలు ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. హడావుడిలో మర్చిపోయాను సార్ అని CI మల్లిఖార్జున్ చెప్పారు. ఐతే.. రూల్ ఎవరికైనా ఒకటేనంటూ ఆ CIకి ఫైన్ విధించి స్వయంగా తానే మాస్క్ తొడిగారు SP.

కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని పోలీసులు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ అమ్మిరెడ్డి సూచించారు. వాహనదారులెవరూ మాస్క్‌ లేకుండా బయటకు రావొద్దని.. స్వీయ రక్షణ చర్యలే వైరస్ నుంచి దూరంగా ఉండేందుకు ఉపయోగపడతాయని అన్నారు. దుకాణదారులు కూడా మాస్క్ లేకుండా ఎవరైనా వస్తే అనుమతించ వద్దని ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story