ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జీతంతో పాటు ఎక్స్‌ట్రా పేమెంట్

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జీతంతో పాటు ఎక్స్‌ట్రా పేమెంట్

ఆర్టీసీ బస్సు, డ్రైవర్ల కష్టానికి ప్రతిఫలం దక్కుతోంది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ సర్కార్ (Jagan Government) గుడ్ న్యూస్ తెలిపింది. నైట్ సర్వీస్ లో విధులు నిర్వర్తించే ఆర్టీసీ డ్రైవర్లకు, కండక్టర్ లకు నైట్ ఔట్ భత్యాలను జీతంతో కలిపి చెల్లించేలా ఆదేశాలు జారీ చేసింది వైసీపీ ప్రభుత్వం.

విలీనం జరిగిన తర్వాత ఎదురైన సమస్యల పరిష్కారంపై జగన్ సర్కారు దృష్టిపెట్టింది. ఆర్టీసీ (RTC) ప్రభుత్వ శాఖలో విలీనం కాక ముందు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ లకు జీతం ఇచ్చినప్పుడే ఈ భత్యం కూడా ఇచ్చే విధానం ఉండేది. ఆర్టీసీ ఉద్యోగులకు సీఎఫ్ఎంఎస్ పద్ధతిలో జీతాలు చెల్లింపు చేయటం మొదలైన నాటి నుండి ఈ విధానానికి ఫుల్ స్పాట్ పడింది. ఇది సరిచేయాలని జగన్ ప్రభుత్వానికి ఉద్యోగులు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. దీనిపై జగన్ స్పందించారు.

ఆంధ్రప్రదేశ్ పరిధిలో సాయంత్రం 6 గంటల నుండి మిడ్ నైట్ 12 గంటల మధ్య నైట్ ఔట్ విధులకు వెళ్లే వారికి 150 రూపాయలు, 12 గంటలకు పైగా విధుల్లో ఉంటే 3వందల రూపాయలు చొప్పున పే చేస్తారు. పొరుగు రాష్ట్రాలకు వెళ్లి రాత్రి సర్వీసులు నడిపే వారికి 2వందల రూపాయల నుండి 4వందల రూపాయల వరకు చెల్లిస్తారు. నైట్ ఔట్ భత్యానికి సంబంధించి దాదాపు 20 నెలల బకాయిలు వున్నాయని, వాటిని అన్నింటినీ చెల్లించాలని ఉద్యోగులు చేస్తున్న ప్రధాన డిమాండ్. మరి ఎరియర్స్ కూడా ఎలక్షన్ ముందు ఇచ్చేస్తుందా లేదా అనేది చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story