ఆంధ్రప్రదేశ్

వైసీపీ ఎంపీల తీరుపై రాజ్యసభ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేస్తాం : కనకమేడల

వైసీపీ ఎంపీల తీరుపై రాజ్యసభ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేస్తాం : కనకమేడల
X

పార్లమెంటును కూడా... రాజకీయ పబ్బం గడుపుకునేందుకు.. విజయసాయిరెడ్డి ప్రయత్నించారని... టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఫైర్ అయ్యారు. కొవిడ్‌పై చర్చించాల్సిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌లో ఏసీబీ విచారణ, కోర్టుల దుర్వినియోగం అంటూ అసంబద్ధ అంశాలను లేవనెత్తారని తెలిపారు. పార్లమెంట్ లో జరిగే చర్చను సైతం రాజకీయం చేస్తున్నారని కనకమేడల ఫైర్ అయ్యారు. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణపై కూడా మీడియాపై నిషేధాజ్ఞలు కొరలేదా అని ప్రశ్నించారు. న్యాయస్థానాల పై బురద జల్లాలన్న ఏకైక లక్ష్యంతో... జడ్జీలను సైతం బెదిరించాలనే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.

Next Story

RELATED STORIES