చీరాలలో దళిత యువకుడి మృతిపై చర్యలేవి?: లోకేష్‌

చీరాలలో దళిత యువకుడి మృతిపై చర్యలేవి?: లోకేష్‌
చీరాలలో మాస్క్‌ పెట్టుకోలేదంటూ దళిత యువకుడు కిరణ్‌ను పోలీసులు కొట్టి చంపి ఏడాది పూర్తయినా బాధ్యులపై చర్యలు తీసుకోలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ మండిపడ్డారు.

చీరాలలో మాస్క్‌ పెట్టుకోలేదంటూ దళిత యువకుడు కిరణ్‌ను పోలీసులు కొట్టి చంపి ఏడాది పూర్తయినా బాధ్యులపై చర్యలు తీసుకోలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ మండిపడ్డారు. పోలీసులపై క్రమశిక్షణ చర్యలెందుకు తీసుకోలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దళితులంటే ఎందుకింత కక్ష జగన్‌రెడ్డి గారూ? అని లోకేష్‌ ట్వీట్టర్‌లో ప్రశ్నించారు. కిరణ్‌ను చంపడానికి మనసు ఎలా ఒప్పందని పేర్కొన్నారు. మాస్క్‌ పెట్టుకోకపోవడం నేరమైతే.... మాస్క్‌ పెట్టుకోని జగన్‌కు పోలీసులు ఏం శిక్ష విధిస్తారని అన్నారు. కిరణ్‌ హత్య వెనుక కారణాలపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. కిరణ్‌ను హత్య చేసిన ఎస్‌ఐ, కానిస్టేబుళ్లను శిక్షించాలని అన్నారు. కిరణ్‌ కుటుంబానికి 50లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలి డిమాండ్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story