Chandrababu : చంద్రబాబుకు కీలక సోమవారం..టీడీపీ శ్రేణులలో తీవ్ర ఉత్కంఠ

Chandrababu : చంద్రబాబుకు కీలక సోమవారం..టీడీపీ శ్రేణులలో తీవ్ర ఉత్కంఠ

తెలుగుదేశం అధినేత చంద్రబాబుకి సంబంధించిన కేసుల్లో ‘సోమవారం’ కీలకం కానుంది. దిగువ కోర్టు నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణలు, తీర్పులు వెలువడనున్నాయి. నైపుణ్యాభివృద్ధి సంస్థకు సంబంధించి సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై సోమవారం విచారణ ఉంది. ఇదే కేసులో తనకు బెయిలు మంజూరు చేయాలని చంద్రబాబు వేసిన పిటిషన్ పై విజయవాడలోని ఏసీబీ కోర్టు సోమవారమే నిర్ణయాన్ని వెల్లడించనుంది. దీంతో పాటు మరోసారి పోలీసు కస్టడీకి కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్ పై సైతం సోమవారం ఏసీబీ కోర్టు తగిన ఉత్తర్వులు జారీచేయనుంది. ఈ రెండు పిటిషన్లపై శుక్రవారం ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. హైకోర్టులోనూ సోమవారం చంద్రబాబుకు సంబంధించిన మూడు బెయిలు పిటిషన్లపై తీర్పులు వెల్లడికానున్నాయి. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు, ఫైబర్ నెట్ కేసుల్లో బెయిలు కోసం చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై ఇటీవల వాదనలు ముగియడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేశ్ రెడ్డి తీర్పులను రిజర్వు చేశారు. ఈ మూడు పిటిషన్లలో సోమవారం న్యాయమూర్తి నిర్ణయం వెల్లడించనున్నారు

Tags

Read MoreRead Less
Next Story