జగన్‌ బెయిల్‌ రద్దు కేసులో మరో పిటిషన్ వేసిన ఎంపీ రఘురామ

ఏపీ సీఎం జగన్‌ బెయిల్ రద్దు పిటిషన్‌లో CBI కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు

జగన్‌ బెయిల్‌ రద్దు కేసులో మరో పిటిషన్ వేసిన ఎంపీ రఘురామ
X

ఏపీ సీఎం జగన్‌ బెయిల్ రద్దు పిటిషన్‌లో CBI కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు ఎంపీ రఘురామకృష్ణరాజు. ఆయన దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై కాసేపట్లో వాదనలు జరగనున్నాయి. కొన్ని పరిణామాల నేపథ్యంలో రేపటి CBI న్యాయస్థానం తీర్పు నిష్పాక్షికంగా ఉంటుందా లేదా అనే సందేహం తనకు వచ్చిందని రఘురామ అంటున్నారు. జగన్‌ మీడియా తప్పుడు ప్రచారంతో, ఆ తీర్పు ప్రభావితమయ్యే అవకాశం ఉందంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే.. నిష్పాక్షికమైన తీర్పు కోసం దీన్ని మరో బెంచ్‌కు బదిలీ చేయాలంటూ కోరారు. ఈ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Next Story

RELATED STORIES