AP: ఏపీలోపారిశుద్ధ్య కార్మికుల ఆందోళనలో ఉద్రిక్తత

AP: ఏపీలోపారిశుద్ధ్య కార్మికుల ఆందోళనలో ఉద్రిక్తత
విశాఖలో ఎక్కడికక్కడ గుట్టలుగా పేరుకుపోయిన చెత్త... కార్మికులను అరెస్ట్‌ చేసిన పోలీసులు

విశాఖలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నాలుగు రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తుండంటో...నగరంలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. దీంతో సచివాలయ ఉద్యోగుల పర్యవేక్షణలో చెత్త సేకరణకు కమిషనర్ ఆదేశాలివ్వడంపై కార్మికులు మండిపడ్డారు. చెత్తసేకరణకు వచ్చిన అధికారులను అడ్డుకోవడంతో పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు వేతనాలు పెంపు సహా....డిమాండ్లు పరిష్కరించాలంటూ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన ఆందోళన తీవ్రరూపం దాల్చింది. పారిశుద్ధ్య కార్మికుల నిరవధిక సమ్మెతోఎక్కడికక్కడ గుట్టలుగుట్టలుగా చెత్త పేరుకుపోయింది. దీంతో సచివాలయ ఉద్యోగుల పర్యవేక్షణలో చెత్త సేకరణకు విశాఖ కమిషనర్ ఆదేశించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కార్మికులు.... చెత్త సేకరించే వాహనాలు బయటకు రాకుండా అడ్డుకున్నారు. తెల్లవారుజామునే KRM కాలనీ వద్ద వాహనాల యార్డు ముందు నిరసన తెలిపారు. అక్కడికి నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయ సిబ్బంది చేరుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది.


అరిలోవ డంపింగ్ యార్డ్ వద్ద ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేయడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. అప్పుఘర్ వద్ద పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నిరసన చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను అరెస్టు చేశారు. వేపగుంట డంపింగ్ యార్డ్ వద్ద పారిశుద్ధ్య కార్మికుల నిరసన తెలపగా... క్లాప్ వాహనాలను బయటికు రప్పించేందుకు పోలీసుల యత్నంచంగా పారిశుద్ధ్య కార్మికులు అడ్డుకున్నారు. మరోవైపు జగన్ మొండైతే... తాము జగమొండి అంటూ 19వరోజూ..... అంగన్వాడీల ఉద్యమం ఉద్ధృతంగా సాగుతోంది. అనేక చోట్ల మంత్రుల ఇంటి ముట్టడికి అంగన్వాడీ కార్యకర్తలు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే బైఠాయించి నినాదాలు చేస్తున్నారు. ప్రభుత్వం దిగివచ్చి తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె ఆగదని స్పషం చేశారు.


అనంతపురంలో అంగన్వాడీల అరెస్టు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కళ్యాణదుర్గంలో మంత్రి ఉష శ్రీచరణ్ ఇంటిని ముట్టడించడానికి... అంగన్వాడీ కార్యకర్తలు బయలుదేరారు. ఈ నేపథ్యంలో అనంతపురం శివారులోని బైపాస్ సరిగమ్మ దేవాలయం వద్ద పోలీసులు అంగన్వాడీల వాహనాన్ని అడ్డుకున్నారు. ఆటో, జీప్ వాహనాల్లో ఉన్న అంగన్వాడీలను కిందకు దింపేశారు. దీంతో ఆగ్రహించిన అంగన్వాడీలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. పెద్ద ఎత్తున అంగన్వాడీలు స్టేషన్ వద్దకు చేరుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story