CBN: రాష్ట్రాన్ని కాపాడుకుందాం కదిలి రండి

CBN: రాష్ట్రాన్ని కాపాడుకుందాం కదిలి రండి
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు పిలుపు... కనిగిరి వేదికగా రా కదిలి రా ప్రచార సభలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు గత ఎన్నికల్లో చిన్న పొరపాటు చేసి ఐదేళ్లు నరకం అనుభవించారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ఏడాది స్వర్ణ యుగం రావాలంటే రాతి యుగం పోవాలని పిలుపునిచ్చారు. రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపితేనే తెలుగుజాతికి పూర్వ వైభవం వస్తుందని స్పష్టం చేశారు. జగన్‌ ప్రభుత్వం పది రూపాయలు పంచి వంద లాగేస్తోందని కనిగిరిలో నిర్వహించిన భారీ బహిరంగసభలో చంద్రబాబు మండిపడ్డారు. జగన్‌ కబంధ హస్తాల నుంచి ఆంధ్రప్రదేశ్‌ను కాపాడుకునేందుకు ప్రజలందరూ...... కదలి రావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలుగుదేశం-జనసేన ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని.. అన్నారు.


ప్రకాశం జిల్లా కనిగిరి వేదికగా 'రా.. కదలిరా పేరిట తెలుగుదేశ-జనసేన పార్టీలు సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. నాడు NTR తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలి రా... అని పిలుపునిస్తే అది ప్రభంజనమైందని ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలందరూ కదిలి రావాలని.. చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి బాటలో సాగాలంటే సైకో పోవాలి సైకిల్‌ రావాలని చంద్రబాబు అన్నారు. సూపర్ సిక్స్ ద్వారా పేదరికం లేని సమాజాన్ని తీసుకువస్తామన్న తెలుగుదేశం అధినేత సంపదను ఎలా పెంచుకోవాలో ప్రజలకు నేర్పిస్తామని చెప్పారు. ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను జగన్‌ మోసం చేశారని చంద్రబాబు మండిపడ్డారు.


ప్రజలకు సేవ చేసిన వారికి ఎమ్మెల్యే, ఎంపీ సీటు ఇచ్చిన వారిని చూశాను కానీ... తనను, లోకేష్‌ను, పవన్ కల్యాణ్‌ను తిట్టిన వారికే సీట్లు ఇస్తామని జగన్‌ చెప్పడం... తన రాజకీయ అనుభవంలో ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్‌కు ఓడిపోతామని పిరికితనం వచ్చిందని అందుకే ప్రజా ప్రతినిధులను ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు కూడా.. బదిలీలు ఉంటాయని తనకు ఇంతవరకూ తెలీదని చంద్రబాబు అన్నారు. 2029 నాటికి ఏపీ నెంబర్‌వన్ కావాలని ప్రణాళిక రచించామన్న చంద్రబాబు.... అధికారం చేపట్టగానే తన అనుభవంతో అభివృద్ధిని పరుగులు తీయిస్తానని ఉద్ఘాటించారు.

ఏపీ ప్రజలు గత ఎన్నికల్లో చిన్న పొరపాటు చేసి ఐదేళ్లు నరకం అనుభవించారని .. కొత్త ఏడాది స్వర్ణ యుగం రావాలంటే రాతి యుగం పోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో 'రా.. కదలిరా' పేరిట ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. రాష్ర్టంలో ఎక్కడ చూసినా కుంభకోణాలే అని ధ్వజమెత్తారు. ... వైకాపా ప్రభుత్వం పది రూపాయలు పంచి వంద లాగేస్తుందని మండిపడ్డారు. ప్రజలకు సేవ చేసిన వారికి ఎమ్మెల్యే, ఎంపీ సీటు ఇచ్చిన వారిని చూశాను కానీ.. తనను, లోకేష్‌ను, పవన్ కల్యాణ్‌ను తిట్టిన వారికే సీట్లు ఇస్తారనడం.. రాజకీయ అనుభవంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story