ఆంధ్రప్రదేశ్

వైసీపీ రాక్షసులపై రేణుక చేసే పోరాటానికి అన్నగా అండగా ఉంటా : లోకేష్

స్వయంగా మంత్రులే మృగాళ్లను కాపాడేందుకు రంగంలోకి దిగితే ఇక మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుందని లోకేష్ ప్రశ్నించారు.

వైసీపీ రాక్షసులపై రేణుక చేసే పోరాటానికి అన్నగా అండగా ఉంటా : లోకేష్
X

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం వైసీపీ నేత చలపతి శ్రీనివాసరావు కుమారుడు ప్రేమ పేరుతో అమ్మాయిని వంచించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. వైసీపీ నేత కుమారుడు ధనుష్ క్రిష్ణ చేతిలో అన్యాయానికి గురైన బైరిశెట్టి రేణుక అనే అమ్మాయి ఇపుడు ఎన్నికల బరిలో దిగింది. అమలాపురం మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తోంది.

ఎన్నికల్లో అమ్మాయి పోటీ చేయడంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. రేణుక ధైర్యానికి సలామ్ చేశారు. వైసీపీ రాక్షసులపై రేణుక చేసే పోరాటానికి అన్నగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. స్వయంగా మంత్రులే మృగాళ్లను కాపాడేందుకు రంగంలోకి దిగితే ఇక మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. రేణుకను మోసం చేసిన ప్రబుద్ధులను కఠినంగా శిక్షించాలని లోకేష్ డిమాండ్ చేశారు.

Next Story

RELATED STORIES