LOKESH: క్వార్టర్‌ మేటర్‌ దగ్గరే జగన్‌పై దాడి

LOKESH: క్వార్టర్‌ మేటర్‌ దగ్గరే జగన్‌పై దాడి
నారా లోకేశ్‌ విమర్శలు.... అయిదుగురు మైనర్లను అదుపులోకి తీసుకున్న సిట్‌

క్వార్టర్ మేటర్ దగ్గరే జగన్ పై దాడి జరిగిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. క్వార్టర్ మందుతోపాటు ఇస్తానన్న 350 ఇవ్వనందుకే దాడి అంటూ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. మండదా అక్కా......మండదా చెల్లీ... మండదా తమ్ముడు......మండదా అన్నా..... అంటూ జగన్ ప్రసంగం డైలాగ్ లను ఎక్స్ లో పోస్ట్ చేశారు. "కోడికత్తి డ్రామా 2...... వైసీపీ అంతం" అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.

మరోవైపు ముఖ్యమంత్రి జగన్‌పై రాయి దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఐదుగురు మైనర్లను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనుమానితులు... సీసీఎస్ పోలీసుల అదుపులో ఉన్నట్లు... తెలుస్తోంది. అజిత్‌సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన మైనర్లలో ఒకరు........ సీఎం జగన్ పై రాయి విసిరినట్టు పోలీసులు చెబుతున్నారు. ఎవరు విసిరారనే అంశంపై స్పష్టతనివ్వాల్సి ఉంది. ఎందుకు దాడి చేశారు... ఎలా దాడి చేశారనే వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు....120 మందికిపైనే అనుమానితులను ప్రశ్నించిన పోలీసులు... స్థానికులు తీసిన వీడియోలను పరిశీలించారు.


సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో తమవారిని అక్రమంగా నిర్బంధించారంటూ విజయవాడ వడ్డెరకాలనీ వాసులు ఆందోళనకు దిగారు. పోలీసుల తీరుకు నిరసనగా డాబాకొట్ల సెంటర్‌లో రాస్తారోకో చేశారు. రూ.200 ఇస్తామని చెప్పి జగన్‌ రోడ్‌షోకు తీసుకెళ్లారని, ఇస్తామన్న డబ్బులు ఇవ్వకుండా తప్పుడు కేసులు బనాయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఎక్కడున్నారో కూడా చెప్పడం లేదని ఆవేదనకు గురయ్యారు. సీఎంపై రాయి దాడి జరిగిన సమయంలో తమ వారు ఆ ప్రాంతంలో లేకపోయినా ఐదుగురు పిల్లలను ఈరోజు తెల్లవారుజామున పోలీసులు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే విడుదల చేయకపోతే పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story