ఏపీని రైతులేని రాజ్యం చేయాలని వైసీపీ భావిస్తోంది : నారా లోకేశ్

ఏపీని రైతులేని రాజ్యం చేయాలని వైసీపీ భావిస్తోంది :  నారా లోకేశ్
ఏపీని రైతులేని రాజ్యం చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ మండిపడ్డారు. రైతులను అవమానించే విధంగా ప్రభుత్వ వ్యవహారం..

ఏపీని రైతులేని రాజ్యం చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ మండిపడ్డారు. రైతులను అవమానించే విధంగా ప్రభుత్వ వ్యవహారం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలు కారణంగా నష్టపోయిన రైతులను ఆయన పరామర్శిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ అనంతపూర్‌ జిల్లాలో నీట మునిగిన పంటలను పరిశీలించారు..

శింగనమల రైతులతో మాట్లాడారు.. ఏ మేర పంటనష్టం జరిగిందో ఆరా తీశారు. అలాగే ప్రభుత్వం నుంచి ఏమైనా హామీ వచ్చిందా అని రైతులను అడిగి తెలుసుకున్నారు.. మొదట గుంతకల్‌ తరువాత తాడిపత్రి, పెద్దవడుగూరు మండలాల్లో లోకేష్‌ పర్యటించారు. గుంతకల్‌ నియోజకవర్గం కరిడికొండలో పర్యటించారు. భారీ వర్షాలు కారణంగా దెబ్బతిన్న వరి, వేరు శనగ, పత్తి పంటలను చూసి.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు..

రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పంటనష్టం చేకూరిన ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు లోకేష్‌.. ప్రతిపక్ష నేత వస్తే హడావుడి ప్రెస్ మీట్లు పెడుతున్నారు.. తప్ప రైతులకు ఏం చేయడం లేదన్నారు. 2వేల కోట్లు వేరుశనగ రైతులకు పంట నష్టం జరిగిందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story