ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు

ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు

ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో పెద్దఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. తొలిదశలో ఎన్నికలు జరిగే 3251 గ్రామ పంచాయతీల్లో 19వేల 491 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. మొదటి రోజు వెయ్యి 313 నామినేషన్లు దాఖలు కాగా.... రెండోరోజు 7వేల 463 మంది నామినేషన్లు వేశారు. చివరి రోజు 10వేల 715 నామినేషన్లు దాఖలయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 2వేల 890 మంది, నెల్లూరు జిల్లాలో అత్యల్పంగా 959 మంది సర్పంచ్ అభ్యర్థులుగా పోటీకి దిగారు.

అటు.... తొలిదశలో ఎన్నికలు జరుగుతున్న 3251 గ్రామాల్లోని 32వేల 522 వార్డులకు..... 79వేల 799 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొదటిరోజు 2వేల 201 మంది, రెండోరోజు 23వేల 342 మంది, మూడోరోజు 54వేల 256 మంది అభ్యర్థులు నామినేషన్‌ వేశారు.

అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పంచాయతీ ఎన్నికల్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నేపథ్యంలో.. బరిలో నిలిచేందుకు పెద్ద సంఖ్యలో నేతలు ముందుకొచ్చారు. ఆయా పార్టీలు బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం రంగంలోకి దిగారు. పంచాయతీ నామినేషన్ల సందర్భంగా పలు గ్రామాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. టీడీపీ బలపర్చిన అభ్యర్థులపై అధికార వైసీపీ అరాచకాలకు పాల్పడింది.


Tags

Read MoreRead Less
Next Story